నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పనిచేసిన డిపిఓలను అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకే దక్కిందని, అందుకే ఈ ఉద్యోగాన్ని కేవలం పనిగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని ఆమె తెలిపారు.
నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా తయారు చేస్తా..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. అయితే, బిదూరి తాజాగా మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని హాట్ కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు.
హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గర్భవతైన మైనర్ బాలిక!
గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ చేశారు. కామాంధుడు జోజి బాబును పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
న్యూమో వైరస్ గురించి భయాందోళనలు అవసరం లేదు..
చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. న్యూమో విరిలే కుటుంబానికి చెందిన ఈ వైరస్.. కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా.. వారితో సన్నిహితంగా మెలగటం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని పేర్కొన్నారు.
నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు. జనవరి 26న రైతు భరోసా పేరుతో మోసం చేయడానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఎన్నికలకు ఆర్నెళ్లకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చింది.. భూయజమానులకు, కౌలు రైతులకు రైతు భరోసాం ఇస్తాం అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు. మీరు పదివేలు బిచ్చం వేస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అన్నారని చెప్పారు.
సీఎంఆర్ కాలేజీ కేసులో ఇద్దరు అరెస్ట్..
మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన నంద కిశోర్, గోవింద్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంఆర్ కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లో తొంగిచూసినట్లు గుర్తించారు. దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూమ్‌ల్లో కిశోర్, గోవింద్ ఈ నీచ పనికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కిశోర్, గోవింద్‌తోపాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. కాలేజీ డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంతనారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినులను ఉద్దేశించి కిశోర్, గోవింద్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. విద్యార్థినుల ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకుండా వదిలిపెట్టింది. దీంతో.. విద్యార్థినుల ఆందోళనలను పట్టించుకోనందుకు వారిపై కేసులు నమోదు చేశారు. విద్యార్థినుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించినందుకు యాజమాన్యంపై కేసులు పెట్టారు.
గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటం తమ కల అని, ఆ కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని వివరించారు.
ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికి ఎలాంటి ప్రకటన లేదు
ఈరోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డీఏ బకాయిలు, పీఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా జాబ్ చార్ట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. ఏడు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు. ఉద్యోగుల పని వాతావరణం మెరుగుపరుస్తాం అన్నారు.. ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అని పేర్కొన్నారు. ఉద్యోగులకు గౌరవం లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారు.. మహిళా ఉద్యోగులను ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతున్నారన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు.. ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటం తమ కల అని, ఆ కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని వివరించారు.