పార్లమెంటులో జాతీయ రహదారుల కోసం గళ మెత్తింది నేనే..
జాతీయ రహదారుల కోసం పార్లమెంటులో గళ మెత్తింది నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణం లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలసి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో మాట్లాడుతూ.. కరీంనగర్ కు ఎంపీగా స్మార్ట్ సిటి పనులకోసం రూ.1000 కోట్లు అభివృద్ధి పనులు తీసుకచ్చిన అన్నారు. మళ్లీ కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి యాలని ఉందన్నారు. బండి సంజయ్ కి ఓటు ఎందుకు ఓటు వేయాలి? అని ప్రశ్నించారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్ తీసుకొచ్చింది నేనే మరి కొద్ది రోజుల్లోనే సిరిసిల్ల నుండి హైదరాబాదుకు రైలు మార్గం సుగమనం అన్నారు.
రాజీనామా పత్రంతో హరీష్ రావు.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత..
గన్ పార్క్ వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ వద్ద హరీష్ రావు కార్యక్రమానికి 5 మంది కి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. అయితే నేతలు, కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అయినా కూడా లోనికి 5మందికి మాత్రమే అనుతిస్తామని తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద ఉన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి
మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందితో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలని ఆయన కోరారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా ఇప్పటినుండే తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందిలతో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలన్నారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచే తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని తాను కోరుకుంటున్నా అని వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీని వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో ఈరోజు విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.
ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..
ఫిబ్రవరి 23, 2023 న అప్పటి మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తానని సవాల్ చేశారు, రుణమాఫీ చేశారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మనకొండూరు ఎమ్మల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ సీఎం రేవంత్ పై హరీష్ రావు చేస్తున్న సవాల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23, 2023 న అప్పటి మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేస్తానని సవాల్ చేశారు, రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరింత బలం కావాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలో 17 కు 17 ఎంపి స్థానాలు గెలిపించాలని కోరారు.
ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు.. బయటకు వెళ్లి ఓటు వేయండి : ఎంపీ సుధామూర్తి
లోక్‌సభ రెండో దశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరులోని బీఈఎస్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవద్దని, బయటకు వెళ్లి ఓటు వేయాలని అన్నారు. సుధా మూర్తి మాట్లాడుతూ, ‘ఇంట్లో కూర్చోవద్దని, బయటకు వెళ్లి ఓటు వేయమని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ హక్కు, మీ నాయకుడిని ఎన్నుకోండి. గ్రామీణ ప్రాంతాల వారి కంటే నగరాల్లోని ప్రజలు తక్కువ ఓటు వేస్తారని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నా వయస్సు వారు కూడా ఎక్కువగా ఓటు వేస్తున్నారు.. కాబట్టి యువత వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సుధా మూర్తి ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్. గత సంవత్సరం సుధా మూర్తి తన సామాజిక సేవకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
మార్పుకోసం.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను : ప్రకాష్ రాజ్
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసి దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తున్నారు. సౌత్, బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రకంపనలు సృష్టించిన నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. నిత్యం తన రాజకీయ ప్రకటనల కారణంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తుంటాడు. ప్రకాష్ రాజ్ కూడా శుక్రవారం ఓటు వేశారు. ఈ సందర్భంగా సౌత్ సూపర్‌స్టార్ ఏమన్నారో తెలుసుకుందాం.
నా రాజీనామా ఆమోదించండి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..
స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసి స్పీకర్‌ను కోరారు. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారని తెలిపారు.
టీడీపీకి షాక్.. యనమల కృష్ణుడు రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. అయితే.. యనమల కృష్ణుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఈ నెల 27న యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.. మరోవైపు ఈ రోజు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ నామినేషన్ కార్యక్రమంలో యనమల కృష్ణుడు పాల్గొంటారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి చేశారు..
మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే..!
మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో సునీతమ్మను గెలిపించాలి అని కోరారు. కంటోన్మెంట్ నుంచి 25 వేల మెజార్టీ ఇవ్వాలన్నారు. సునీతమ్మ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటి నుంచి 250 వాహనాలతో ర్యాలీ తీశారు. కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది.