కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అందరినీ మోసం చేసింది
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రైతుల దాకా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందిస్తామన్న కాంగ్రెస్ హామీ దూరమైనప్పటికీ, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
వెలుగులోకి నిందితురాలి వాట్సప్ చాట్.. హతుడి సోదరికి ఏం పంపిందంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్య ముస్కాన్, ప్రియుడి సాహిల్ చేతిలో అత్యంత ఘోరంగా హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను అతి క్రూరంగా హత మార్చిన దుర్మార్గురాలు.. ఏమి ఎరగనట్టుగా.. హతుడి సోదరి చింకికి అతడి మొబైల్ నుంచే హ్యాపీ హోలీ అంటూ ముస్కాన్ వాట్సాప్ చాట్ చేసింది. పాపం.. పుణ్యం ఎరుగని సోదరి.. తన సోదరుడు బతికే ఉన్నాడనుకుని చాటింగ్ చేసింది. కానీ ఆమె.. తన సోదరుడికి ఫోన్ చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు.
అమెరికా నుంచి భారతీయ విద్యార్థి బహిష్కరణ.. కారణమిదే!
అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయులను వెనక్కి పంపేసింది. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరి అమెరికాలో బహిష్కరణకు గురయ్యాడు. హమాస్‌కు మద్దతుగా.. యూదు మతానికి వ్యతిరేకంగ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాదర్ ఖాన్ సూరిపై బహిష్కరణ వేటు వేసింది. సోమవారం వర్జీనియాలోని అతని ఇంటి వెలుపుల డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వీసాను రద్దు చేసింది.
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన విషయాలు.. వాళ్లే టార్గెట్
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు.
లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం.. బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం!
నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంకు సీఎంతో పాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం ఆరంభం కానుంది. ఏపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ నేటితో ముగియనుంది.
లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో కళాకారులు పలు కళాకృతులు ప్రదర్శించనున్నారు. సంస్కృతిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు భాగం పంచుకోనున్నారు. సీఎం చంద్రబాబు నేడు క్రీడలు ఆడే అవకాశం ఉంది. ‘ఇవాళ సాయంత్రం విజయవాడలో సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరు అవుతారు. క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ఈరోజు తెలిపారు.
మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. విద్యాశాఖ మూసివేత!
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధికారం చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ పాలన చాలా దూకుడుగా కనిపిస్తోంది. ఇటీవల వాణిజ్య యుద్ధం ప్రకటించగా మార్కెట్లు చతికలపడ్డాయి. అనంతరం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అలాగే సంస్థాగతంగా కూడా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యయం తగ్గించుకునేందుకు ఉద్యోగుల కోత విధించారు. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఏకంగా విద్యాశాఖనే మూసివేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు. విద్యాశాఖ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని.. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విభాగాన్ని మూసివేసే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ పై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా..?
బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుపాటి ,ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,నటి శ్యామల తో పాటు పలువురు యూట్యూబర్ల పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సెలబ్రెటీలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సెలబ్రిటీలు ప్రచారం చేయడంతో దానికి ఆకర్షితులై యువత అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికి తోడు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయారు.
తెలంగాణలో రేషన్‌కార్డు మీకు ఉందా.. అయితే ఇది మీకోసమే..
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.
నిమ్మకాయల్లో మత్తుమందు.. స్పృహ కోల్పోయాక అత్యాచారం
తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేషధారణలో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక దొంగబాబా అరెస్ట్ అయ్యాడు. మెదక్ జిల్లాలో పట్టుబడ్డ ఈ నిందితుడు, తనను “బాపు స్వామి”గా పరిచయం చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘోర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిందితుడు తనను మహాత్ముడిగా చిత్రీకరించుకుంటూ, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే తాను శక్తివంతమైన పూజలు చేసి నయం చేస్తానని నమ్మించాడు. తనను విశ్వసించిన మహిళలకు ప్రత్యేక పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు.
దొంగబాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగిస్తాడు. స్పృహ కోల్పోయిన తర్వాత వారి అసహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అంతేకాదు, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి, బాధితులను బెదిరించేవాడు.
స్నేహితురాలిపై దారుణం.. ప్రియుడితో అత్యాచారం చేయించి వీడియో తీసిన యువతి
తెలంగాణలో మానవత్వం మంటగలిసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిపై నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ, హృదయ విదారకమైన పాశవిక చర్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రోజా అనే యువతి తన స్నేహితురాలిని (26) ఇంటికి ఆహ్వానించి ఘోర మోసానికి పాల్పడింది. మద్యం తాగించి, ఆమెను మత్తులోకి నెట్టివేస్తూ, తన ప్రియుడు ప్రమోద్ చేత ఆమెపై అత్యాచారం చేయించింది. అంతేకాదు, ఈ దారుణ ఘటనను వీడియో తీసి భద్రపరుచుకుంది.
ఒక్కసారి జరిగిన ఈ అమానవీయ చర్యను రోజా అక్కడే ఆపలేదు. కొద్దిరోజుల తర్వాత బాధిత యువతిని మరోసారి తన ఇంటికి పిలిపించి, ఈసారి తన మరో స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేసింది. దీనికి నిరాకరించిన బాధితురాలిపై రోజా దారుణంగా దాడి చేసింది. భయభ్రాంతులకు గురైన యువతి చివరికి ధైర్యం కూడగట్టి పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.