ముగిసిన సెలవులు.. నేడు సుప్రీంకోర్టులో మణిపూర్ హింస, పురుషుల కమిషన్‌పై విచారణ
వేసవి సెలవుల అనంతరం జులై 3వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తెరుచుకుంది. ఈరోజు తొలిరోజైన రెండు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మొదటి కేసు మణిపూర్ హింసకు సంబంధించినది. దీంతో పాటు పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. రెండు సందర్భాల గురించి తెలుసుకుందాం. మొదటిది, మణిపూర్‌లోని మైనారిటీ కుకీ గిరిజనులకు సైనిక రక్షణ కల్పించాలని, వారిపై దాడి చేస్తున్న మత సమూహాలపై విచారణ జరపాలని కోరుతూ ఒక NGO సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించిన కేసు విచారణకు రానుంది. మణిపూర్ ట్రైబల్ ఫోరం దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అంతకుముందు, ఎన్జీవో సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు విచారణ కోసం పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 20 న జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా బెంచ్ దానిని కొట్టివేసింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, దీనిని పాలనా యంత్రాంగం పరిశీలించాలని కోర్టు పేర్కొంది.
రామ్-బోయపాటి సినిమా బిగ్ అప్డేట్ వచ్చేసింది..
తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ.. వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని విడుదల చేసారు. రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. దాంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..
ఆ టీజర్ లో రామ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించని రేంజ్ మాస్ యాంగిల్ లో బోయపాటి శ్రీను చూపించినట్టు గా అర్థం అవుతుంది. గుబురు గెడ్డం తో లావుగా చాలా కొత్తగా ఇందులో రామ్ కనిపిస్తున్నాడు. బాలయ్య బాబు తో తప్ప కుర్ర హీరోలతో సక్సెస్ రేట్ తక్కువ ఉన్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం తో తాను కుర్ర హీరోలతో కూడా సూపర్ హిట్స్ తియ్యగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. అందుకే రామ్ లాంటి మాస్ హీరోను ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..
గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిన సింహాచలం.. భారీగా తరలి వచ్చిన భక్తులు
సింహాచల పుణ్యక్షేత్రం గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ప్రారంభమైన గిరిప్రదక్షిణలు.. సోమవారం కూడా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో గిరిప్రదక్షిణలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ మార్గాలు ఎటు చూసినా కిక్కిరిసిపోయి కనిపించాయి.. భక్తులు అప్పన్నస్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. భక్తుల హరినామస్మరణలు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ అప్పన్నస్వామి నిత్య, నిజరూప నమూనాలతో కూడిన పుష్ప అప్పన్న తొలి పావంచ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణకు వెళ్లింది.
పెళ్లికాని వారికి కూడా పింఛన్.. ప్రభుత్వ కొత్త పథకం
పెళ్లికాని వారికి కూడా పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కింద, ఇంకా వివాహం చేసుకోని వారికి ప్రయోజనాలు అందించబడతాయి. అటువంటి పెన్షన్ పథకాన్ని తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం ప్రణాళికను ప్రారంభించింది. 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల అవివాహితులకు పెన్షన్ ఇవ్వాలని, ఇందులో స్త్రీలు, పురుషులు ఇద్దరూ ప్రయోజనాలు పొందాలనేది ప్రభుత్వ యోచన. పింఛను మొత్తం, అది ఎలా ప్రయోజనం పొందుతుంది మొదలైన సమాచారం పథకం ఆమోదం తర్వాత తీసుకోబడుతుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
విశ్వరూపం చూపిస్తా వెయిట్ చెయ్యండి
కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ ఆడియన్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ గా చూస్తారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ ప్రిన్స్ అని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే రణబీర్ కపూర్ ని రక్తం ముంచి లేపుతున్నట్లు ఉన్నాడు మన సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ తో చేస్తున్న సినిమా ‘అనిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణబీర్ కపూర్ పంచే కట్టుకొని, గొడ్డలి పట్టుకొని రౌడీలని నరకడం చూసి నార్త్ ఆడియన్స్ షాక్ అయ్యారు.
ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎసస్సార్ కడప జిల్లాలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలో మంగళ వారం రోజు వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతా రామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్సీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో బుధవారం రోజు కూడా వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాహుల్ లీడర్.. కాదు రీడర్
నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ లీడర్ కాదు రీడర్ కదంటూ జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెండు సార్లూ ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలి పెట్టారని, రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారని, బీజేపీకి బీఆర్ఎస్ రిష్తెదార్ కాదన్నారు జగదీష్ రెడ్డి.
టెన్త్ పాసైన వాడిచేతిలో మోసపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
ప్యాకర్స్, మూవర్స్ రవాణా పేరుతో దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నిందితుడు ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రూ.7.12 లక్షలు మోసం చేశాడు. ఆ తర్వాత ఇంజనీర్ ఫిర్యాదు మేరకు సైబర్ స్టేషన్ పోలీసులు పూణెలోని ఓ పాష్ కాలనీలో అద్దెకు ఉంటున్న లలిత్ శర్మ(24)ను అరెస్టు చేశారు. వాస్తవానికి భివానీ జిల్లా పోలీస్ స్టేషన్ జూయి గ్రామం ధాంగేర్‌లో నివాసం ఉంటున్న లలిత్ హైదరాబాద్‌లో అద్దెకు ఆఫీసు తెరిచి ప్రజలను మోసం చేస్తున్నాడు.
సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరుణ్ కుమార్ వర్మ పోర్టల్ ద్వారా ఫిర్యాదును స్వీకరించినట్లు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జితేంద్ర మాట్లాడుతూ బెంగళూరులోని ఓ బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను తన వస్తువులను ఢిల్లీకి డెలివరీ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవల కోసం ఆన్‌లైన్‌లో శోధించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి గతి ప్యాకర్స్, మూవర్స్ నుండి కాల్ వచ్చింది. రవాణా కోసం ఇంజనీర్ క్విడ్ రెనాల్ట్ కారు, కొన్ని గృహోపకరణాలను బుక్ చేశాడు.
బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది
హైదరాబాద్ కోకాపేట్‌లోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బెంగళూరు చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్‌గా హైదరాబాద్ ఉందని, భారత్ లో అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్ లోనే ఉందని ఆయన అన్నారు.
హైదరాబాద్ ను పోల్ పొసిషన్ తీసుకొచ్చేందుకు మెుబిలిటీ వ్యాలీను కూడా తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ అని, టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని, సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు.
146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్
పేదలే కాకుండా ఎక్కడ ఎటువంటి వైద్య సహాయం వచ్చి రవాణా కోసం ఎదురు చూసే వారికి 108 అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంబులెన్స్ సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. అంబులెన్స్ సేవలు నిరుపేదలతోపాటు ప్రమాదాల బారిన పడిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా.. ప్రమాదాల సమయంలో త్వరగా అక్కడికి చేరుకొని వారికి ప్రధమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడుతోంది. అటువంటి 108 అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం సోమవారం కొత్తగా 146 అంబులెన్స్ లను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 146 కొత్త 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఇప్పటికే కొనసాగుతున్న అంబులెన్స్ లకు అదనంగా మరో 146 అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈరోజు కొత్తగా 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లను సీఎం జగన్ పరిశీలించారు. 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్‌ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసి ఈ కొత్త అంబులెన్స్‌లను తీసుకొచ్చింది.
ట్రైలర్ అదిరింది… శివ కార్తికేయన్ ఇరగదీసాడు
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి లాభాలని ఇచ్చిన హీరో, ప్రిన్స్ సినిమాతో కనీసం బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా టచ్ చెయ్యలేకపోయాడు. దీంతో తమిళనాడులో శివ కార్తికేయన్ మార్కెట్ కి డెంట్ పడింది. దాన్ని కవర్ చెయ్యాలన్నా, ఒకప్పటిలా మళ్లీ బయ్యర్స్ తనని నమ్మలన్నా శివ కార్తికేయన్ కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆ హిట్ ని అందుకోవడానికి శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జులై 14న రిలీజ్ కానుంది. తెలుగులో మాహావీరుడు అనే టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కానుంది.