‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పేరుమోసిన ఉగ్రవాది జైలులో ఉన్నప్పుడు అధికారికంగా తండ్రి అయ్యాడని చెప్పడం ద్వారా ఒవైసీ ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఇస్లామాబాద్ విధానం దక్షిణాసియాలో అస్థిరతను ప్రోత్సహిస్తుందని ఒవైసీ అన్నారు.
‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పేరుమోసిన ఉగ్రవాది జైలులో ఉన్నప్పుడు అధికారికంగా తండ్రి అయ్యాడని చెప్పడం ద్వారా ఒవైసీ ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఇస్లామాబాద్ విధానం దక్షిణాసియాలో అస్థిరతను ప్రోత్సహిస్తుందని ఒవైసీ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుండి తిరిగొస్తున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం ద్వారా కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
భర్తపై మరిగే నూనె పోసిన భార్య..
తిరునల్వేలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తపైనే కాచి వడబోసిన నూనె పోసి అత్యంత దారుణంగా గాయపరిచింది ఓ భార్య. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రగిలిపోయిన భార్య, క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ బాలుసుబ్రమణియన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణపురానికి చెందిన 42 ఏళ్ల బాలుసుబ్రమణియన్ ఆటో డ్రైవర్. అతని భార్య మత్తలక్ష్మి (34). ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. చాలా కాలంగా భర్త బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని మత్తలక్ష్మి అనుమానిస్తోంది.
ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోష.. మరో ఐదు కోడెల మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా మరో ఐదు కోడెలు మృతి చెందగా, గత రెండు రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పిఠాపురంలో రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
పిఠాపురం 18 వ వార్డులో రేషన్ షాప్ ద్వారా రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తామన్నారు. దురుద్దేశంతో రేషన్ షాప్ లను గత ప్రభుత్వం రద్దు చేసింది. 29796 రేషన్ షాప్ ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది.. 9260 ఎండీయు వాహనాలు కోసం 1700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రేషన్ షాప్ లలో రాబోయే రోజుల్లో సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 65 ఏళ్ళు నిండిన వృద్దులకి, దివ్యాంగులకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎండియూ వాహనాలతో మోసం చేసిందన్నారు. ఎవరైనా ఇంటికి వెళ్లి రేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.. రేషన్ షాపులను రేషన్ మాల్స్ గా మారుస్తాం.. 15 రోజులపాటు తమకు నచ్చిన సమయంలో వినియోగదారులు రేషన్ తీసుకోవచ్చు.. అవసరమైతే రేషన్ షాపులను అప్డేట్ చేస్తామని తెలిపారు.
పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు..?
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. నేడు ప్రజలకు రేషన్ రైస్ పంపిణీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడంపై మండిపడ్డారు. జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మీకు ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష?.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారు?.. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి.. ప్రజలను కష్టపెట్టడం సబబేనా? అని ప్రశ్నించారు.
ఇలా ఉన్నారేంట్రా బాబు.. పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదని దుకాణంపై గన్ ఫైరింగ్.. చివరకు..?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లో పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి దుకాణంపై గన్‌ఫైరింగ్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన గ్వాలియర్ మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనారాయణ్ బజార్ లో మే 16వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలోని ప్రధాన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి, సంఘటన స్థలంలో సీన్ రీక్రియేట్ చేశారు. దేవనారాయణ్ బజార్‌లో ఉన్న సురజీత్ మావై అనే వ్యక్తికి చెందిన కిరాణా దుకాణానికి ప్రధాన నిందితుడు ఆదిత్య భదౌరియా మే 16వ తేదీ సాయంత్రం బైక్‌పై వచ్చి సిగరెట్ అడిగాడు. అప్పటికే ఉన్న రూ. 250 అప్పును గుర్తు చేసాడు సురజీత్. ఆ తర్వాత ఆ బాకీ తీర్చాలని చెప్పి, అతడు అడిగిన సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో తీవ్ర అసహనం చెందిన ఆదిత్య అక్కడినుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన అతను అదే రాత్రి 11 గంటల సమయంలో, ఆదిత్య భదౌరియా మరో ఇద్దరు వ్యక్తులు ఛోటూ భదౌరియా, అమన్లతో కలిసి బైక్‌పై వచ్చి సురజీత్ దుకాణం వద్ద ఇష్టానుసారం గొడవకు దిగారు. అనంతరం ముగ్గురు కలిసి దుకాణంపై 15 రౌండ్ల కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సురజీత్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో రూ.1.20 కోట్లు మాయం..
తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ను తీవ్ర ఆరోపణలు కకావికలాన్ని సృష్టిస్తున్నాయి. అసోసియేషన్‌లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తోట సురేష్ చేసిన ఫిర్యాదులో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్ , కోశాధికారి కె.బి. శ్రీరాములుపై అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత 40 ఏళ్లుగా వారు పదవుల్లో కొనసాగుతూ సంఘ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతర్-జిల్లా కబడ్డీ టోర్నమెంట్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జిల్లా సంఘాలకు పంపకుండా వారు స్వాహా చేశారని సురేష్ పేర్కొన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం.. హైకోర్టు జడ్జిగా నటించిన మహిళ అరెస్టు
తెలంగాణలో నిరుద్యోగుల ఆశలను తమ లాభాలకు మార్గంగా మలుచుకునే మోసగాళ్ల చతురత రోజురోజుకీ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తామని, ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివిధ రూపాల్లో మోసాలు చేస్తున్నారు. అయితే ఈ సారి పురుషులే కాదు, ఓ మహిళ కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను హైకోర్టు జడ్జినని చెప్పి నిరుద్యోగుల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రసన్నా రెడ్డి అనే మహిళ, హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆశలు చూపింది. దీంతో ఆమె మాటలు నమ్మిన సుమారు 100 మందికి పైగా అమాయక నిరుద్యోగులు లక్షల రూపాయలు చెల్లించారు. మొత్తం రూ.కోట్లు వసూలు చేసిన ఆమె, నిర్దాక్షిణ్యంగా వారిని మోసం చేసి గల్లంతయ్యింది.