పోలీస్ ఉద్యోగం ఒక సవాల్.. ఆ కుటుంబాలకు తోడుగా ఉంటాం..
పోలీసు ఉద్యోగం ఒక సవాల్‌తో కూడుకున్నది అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు.. ఇక, ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందన్న ఆయన.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయన్నారు.. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు.. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని పోలీస్ ఉద్యోగం ఓ సవాల్ అని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరుల సంస్మరణ దినం.. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు.. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజుగా అభివర్ణించారు. మరోవైపు.. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్డేట్ కావాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.
దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం వద్దు.. చర్యలు తీసుకోవాల్సిందే..!
ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం వద్దు.. చట్టాన్ని ప్రజలకు మంచి, రక్షణ కల్పించే పోలీసులపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు అనే పదానికి రీ డిఫైన్ చేయాల్సిన పరిస్థితి.. ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బ తీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే అన్నారు. ప్రభుత్వం, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలని అనుకునే శక్తులు అన్నీ కూడా అడవుల్లో, అజ్ఞాతంలో లేవు.. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా జీవితం మీద దాడి చేయటం ఈ మధ్య చూస్తున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. ప్రజా స్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాల అర్థం అంటే.. ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని, పోలీసులు, న్యాయస్థానం నుంచి లాక్కోవటం కాదు అన్నారు. అంగళ్లులో ప్రతి పక్ష నేత తమ పార్టీ వారిని రెచ్చ గొట్టి పోలీసులపై దాడి చేయించారు.. పుంగనూరులో 40 మంది పోలీసులు గాయాలు అయ్యేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు.. అవినీతి చేసి, నేరాలు చేసి ఆపై ఆధారాలు అన్నీ చూసిన తర్వాత న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వక పోతే న్యాయ మూర్తుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇవన్నీ చేస్తున్నారు.. ఇవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు చేసే పని తప్ప వేరే కాదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా ఎందుకు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎన్నికకు పవన్ కల్యాణ్ ఒక్కొక్క విధానం అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సాంకేతమని ప్రశ్నించారు. ఇక, పవన్ ను రాజకీయాల్లో ఒక టూల్ గా వాడుకుంటున్నారని విమర్శించారు. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకుని రావాలని పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారన్నారు విమర్శలు గుప్పించారు. ఇక, ముద్రగాడను శోభకు గురి చేసింది చంద్రబాబే.. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వేణుగోపాలకృష్ణ.. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ కల్యాణ్ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు శకం ముగిసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు చట్టాలకు అతీతుడు, దేశంలో చట్టాలు వర్తించవనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేవారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు.. నేడు బెయిల్ రాక క్షోభకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ఒక మాట చెప్పాడంటే దైవంగా భావించి చేసే నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా.. జగన్ ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. జనం మనసులో జగన్ ఉన్నాడు.. జగన్ మనసులో జనం ఉన్నారు.. జగన్ – జనం బంధాన్ని ఎవరూ విడదయలేరన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
రోజుకు రూ.25 కోట్లు లాయర్లకే ఖర్చు.. చంద్రబాబుపై సింపతీ ఎక్కడా పెరగలేదు..
స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా.. అన్ని కోర్టుల్లో ఆయన కేసులపై విచారణ సాగుతూ వస్తుంది.. అయితే, చంద్రబాబు లాయర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. రోజుకు 25 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు లాయర్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.. తిరుపతి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డితో కలిసి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు లాయర్ల కోసం రోజుకు రూ.25 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు.. చంద్రబాబుకు ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. ఈ సారి ఆ ముగ్గురు
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ఈ సారి నందమూరి రామకృష్ణ, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాఖత్‌లో చంద్రబాబును కలిశారు.. ఇవాళ ఉదయం 11 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకున్న కుటుంబ సభ్యులు.. చంద్రబాబుతో 40 నిముషాల పాటు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిస్థితులపై కుటుంబ సభ్యులు ఆయనకు వివరించినట్టుగా తెలుస్తోంది.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా అన్ని న్యాయస్థానాల్లో వివిధ పిటిషన్లపై విచారణలు సాగుతోన్న విషయం విదితమే.
వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారని, భూకబ్జా దారులంటూ..వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోడుప్పల్ లో బిఅరెస్ పార్టీ కార్యాలయాన్ని మల్లారెడ్డి ప్రారభించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే చరిత్ర అని అన్నారు. సీఎంగా కేసీఆర్ అయ్యాకనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నారు. కొత్తగా 10 పథకాలు కేసీఆర్ తిసుకువచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పధకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి జంగయ్య దొంగల ముఠా నాయకుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దొంగ, ఇద్దరు దొంగలు తయారు అయ్యారు.. భూకబ్జా దారులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను జైల్ కి పంపించే బాధ్యత నాదే అన్నారు. దళితులకు భూములను పంచె బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వెస్ట్ అవుతుందని తెలిపారు. ఇక్కడ ఎంపీ ఎవరికి తెలియదన్నారు. పీసీసి అయ్యి సీట్లు అమ్ముకున్నాడని మండిపడ్డారు. రేవంత్ ఏ మోహం పెట్టుకొని ఇక్కడకు వస్తారు? అని ప్రశ్నించారు. పగటి వేశగాళ్ళు..వాళ్లని నమ్మవొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్ఫ్ బోర్డ్ భూముల విషయం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్లామని తెలిపారు. రేవంత్, సుధీర్ రెడ్డి, జంగయ్యని తరమి కొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
అలాచేస్తే తాట తిస్తా.. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
నాలుగు సంత్సరాలలో విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల విసృత పర్యటిస్తున్నారు. మామిళ్ళగుడెం లో వెంకట కృష్ణ అపార్ట్ మెంట్ లో జరిగిన ఆత్మీయ పలకరింపు లో తుమ్మల మాట్లాడుతూ.. ఈ నాలుగు సంత్సరాలలో విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే చోట పోటీ చేయాల్సిన అవసరం ఉన్న.. ఇక్కడ అదిరిచ్చి బెదిరించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు.. అందుకే ఇక్కడి నుండి చేస్తున్నానని తుమ్మల స్పష్టం చేశారు. ఇలాంటి కథలు నలబై సంత్సరాల క్రితమే చూసినా అని తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి తోటి అందరూ అభిమానించేలా నలభై సంత్సరాలు రాజకీయాలు చేసినానని అన్నారు. ఇలాంటి కుండాకొరు రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా వాళ్ళ మాట విని మనికి మాలిన అధికారులు ఎవరైనా పనిచేస్తే వాళ్ళ తాట తిస్తా అని హెచ్చరించారు.
కర్ణాటకలో వింత నిరసన.. కరెంట్ ఇవ్వలేదని సబ్ స్టేషన్లో మొసలిని వదిలిన రైతు
సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో కర్ణాటక రైతులు విసుగు చెందిపోయారు. దీంతో హెస్కామ్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలోకి మొసలిని తీసుకొచ్చిన ఘటన విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రుళ్లు ఆలస్యంగా కరెంటు ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్లి నీరందిస్తే ఎలా అని రైతులు వాపోయారు. చీకట్లో జలచరాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వారికి కూడా ఇలాంటివి గుర్తు చేసేందుకు రైతు ఈ చర్యకు పాల్పడ్డాడు. రాత్రిపూట కరెంటు ఇస్తే ఏం లాభం? మా సమస్యను అధికారులు అర్థం చేసుకునేందుకే మొసలిని తీసుకొచ్చామన్నారు. రైతుల భూములకు పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ అందడం లేదు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న రైతన్నలు నిద్రలేచి అర్థరాత్రి నీళ్ల కోసం పొలాలకు పోవాల్సి వస్తుంది. గత రాత్రి పొలంలో తిరుగుతుండగా మొసలి కనిపించడంతో పట్టుకుని ట్రాక్టర్ ద్వారా విద్యుత్తు పంపిణీ కేంద్రానికి తీసుకొచ్చారు. చివరకు అటవీశాఖ అధికారులు రైతులను ఒప్పించి మొసలిని తీసుకెళ్లారు.
విజయం పొందేవరకు పోరాడతాం.. ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయిల్
ఇజ్రాయిల్-హమాస్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగడం లేదు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. ఇజ్రాయిల్ ప్రజల ఆర్తనాదాలు హమాస్ చెవికి వినపడలేదు. హమాస్ జరిపిన అతిక్రూరమైన దాడుల్లో 1400 మందికి పైగా మరణించారు. అలానే 200 మందిని బంధించింది హమాస్.. వాళ్లలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. అయితే నిన్న శుక్రవారం హమాస్ ఆ ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో విజయం పొందే వరకు పోరాడతామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో హమాస్‌ను తొలగించిన తర్వాత US మరియు ఇజ్రాయెల్ అధికారులు గాజా స్ట్రిప్ యొక్క భవిష్యత్తు గురించి చర్చింకుంటున్నాయి. అధికారులు ఐక్యరాజ్యసమితి మద్దతుతో యునైటెడ్ నేషన్స్ మరియు అరబ్ దేశాల మద్దతుతో మధ్యంతర ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
ఇదెక్కడి ట్రైలర్ మావా… విజువల్స్ తో గూస్ బంప్స్ తెచ్చావ్
RX 100 సినిమా అజయ్ భూపతిని కొత్త దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమాని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి తెరకెక్కించిన అజయ్ భూపతి సూపర్ హిట్ కొట్టాడు. ఆర్జీవీ శిష్యుడు అనే పేరుని నిలబెట్టుకున్న అజయ్ భూపతి, మరోసారి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మహా సముద్రం సినిమాతో డిజప్పాయింట్ చేసిన అజయ్ భూపతి, తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ ఫుత్ ని మెయిన్ క్యారెక్టర్ ప్లే చేయిస్తూ మంగళవారం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సాంగ్, పోస్టర్, టీజర్ తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి… లేటెస్ట్ గా మంగళవారం ట్రైలర్ తో మెస్మరైజ్ చేసాడు. స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బయటకి వచ్చిన మంగళవారం ట్రైలర్ ప్రాపర్ థ్రిల్లర్ సినిమాలా కనిపించింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో కట్ చేసిన మంగళవారం ట్రైలర్… “ఒక ఊరిలో గ్రామదేవతకి ఇష్టమైన మంగళవారం రోజునే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ ఊరిలో ఏం జరుగుతుంది? హత్యలు ఎవరు చేస్తున్నారు? ఇందులో అమ్మవారికి లింక్ ఏంటి? మర్డర్స్ జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?” అనే మిత్ చుట్టూ అల్లిన కథతో మంగళవారం సినిమా తెరకెక్కింది. ఏ బోల్డ్ స్టోరీ టోల్డ్ లైక్ నెవర్ బిఫోర్ అనే క్యాప్షన్ పెట్టిన అజయ్ భూపతి, ట్రైలర్ తోనే దాన్ని జస్టిఫై చేసాడు. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ, అజినీష్ లోకనాథ్ మ్యూజిక్ మంగళవారం ట్రైలర్ లో అవుట్ స్టాండింగ్ గా నిలిచాయి. పాయల్ ఇప్పటివరకు చేసిన పాత్రలకన్నా మంగళవారం సినిమాలో కంప్లీట్ కాంట్రాస్ట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ ఎండ్ షాట్ లో పాయల్ ని అజయ్ భూపతి ఫ్రేమ్ చేసిన విధానం టూ గుడ్ అనే చెప్పాలి. మరి ప్రమోషనల్ కంటెంట్ తో మెప్పించిన అజయ్ భూపతి నవంబర్ 17న మంగళవారం సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి.
భగవంత్ బాదుడు… హాప్ సెంచరీ కొట్టేశాడు!
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోష్‌లో వచ్చాడు బాలయ్య. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాలయ్య హిట్ ట్రాక్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్యను రెగ్యులర్ రొట్ట కొట్టుడు క్యారెక్టర్ లో కాకుండా… ఏజ్ కి తగ్గ పాత్రలో ఫ్రెష్ గా చూసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. డే వన్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి… మంచి ఓపెనింగ్స్‌ను దక్కించుకుంది. ఫస్టే డే 33 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన భగవంత్ రెండో రోజు కూడా దుమ్ముదులిపేసింది. రెండో రోజు బాలయ్యకు పోటీగా మాస్ మహారాజా ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరోవైపు దళపతి విజయ్ ‘లియో’ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ రెండు సినిమాలు సోసోగానే ఆడియన్స్ ని మెప్పించాయి. దీంతో బాలయ్యకి అడ్డు లేకుండా పోయింది. ఈ దసరా విన్నర్ యునానిమస్ గా బాలయ్య అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యడంలో బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ కారణంగానే భారీ వసూళ్లను అందుకున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా రెండు రోజుల్లో 51 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్కు రెడీ అవుతున్న బాలయ్య… రెండు రోజుల్లోనే హాప్ సెంచరీ కొట్టేసి సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఇక యూఎస్‌లో 7 లక్షల 50 వేల డాలర్స్ మార్క్‌ని టచ్ చేసి 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. దీంతో మొదటి మండేకి భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.