ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..
ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌కి పూర్ణకుంభం, మంగళ హారతులతో అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా గణపతి కి గజమాల అందజేశారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం ఒగ్గుడోలు, పద్మశాలీలందరూ బోనాలు ఎత్తుకున్న మహిళలతో ఊరేగింపుగా వచ్చి ఖైరతాబాద్ గణేశుడికి చేనేత దారం కండువా, గాయత్రి సమర్పించారు. గతేడాది 63 అడుగుల ఎత్తులో వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70వ వసంతం సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో పెద్ద గణేశుడిని ప్రతిష్ఠించారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకుని ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొంటారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా.. ఇప్పుడు సీఎం హోదాలో..
గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడుగా వచ్చానని.. ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదా లో రావడం తొలిసారి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నా అని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్‌కి పూర్ణకుంభం, మంగళ హారతులతో అర్చకులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా గణపతి కి గజమాల అందజేశారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలిపారు. నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నీ కూడా ఆహ్వానించామని, నగరంలో లక్ష కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అన్ని మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించేందుకు కృషి చేశారన్నారు. పి.జనార్ధన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతో ఘనంగా నిర్వహించేవారన్నారు. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతోందని అన్నారు. గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడుగా వచ్చాను…ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదా లో రావడం తొలిసారి..భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నానని అన్నారు.
ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
ఖైరతాబాద్ మహా గణపయ్యకు పూజలు ప్రారంభమయ్యాయి. అయితే..ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది బడా గణేష్ 70 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేశుడి విగ్రహం తయారీ పనులు ఆలస్యంగా ప్రారంభమైనా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈసారి భక్తులకు శ్రీసప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు. విగ్రహంలో మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు ప్రతిష్టించబడ్డాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. అంతే కాకుండా.. బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. గణపతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ కు రానున్నారు. వీరి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా నిర్వాహకులు ప్రత్యేక షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది దాదాపు 22 లక్షల మంది భక్తులు బడా గణేష్‌ను దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు వస్తారని ఉత్సవ్ కమిటీ అంచనా వేస్తోంది.
ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా 75 అడుగుల బెల్లం వినాయకుడు
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. విశాఖనగరంలో భారీగా గణనాథులు కొలువుదీరారు. గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తు బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 20 టన్నుల బెల్లంతో గణపతిని తయారుచేశారు. పూజలా అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు. బెల్లం దిమ్మెలను క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అనకాపల్లికి చెందిన శిల్పులు రెండు నెలలకు పైగా కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందు కోసం అవసరమైన బెల్లం రాజస్ధాన్ నుంచి రప్పించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలక అను గుణంగా ఈ మండపం రూపొందింది. స్ధానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్ధాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్ధాన్ లో వుండే వేడి వాతావరణకు తట్టుకుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ వుంటుంది కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.. భారీ బెల్లం గణనాథుడు ఏర్పాటు చేయడం ఒక ఎత్తైతే.. అందుకు పాటించిన జాగ్రత్తలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి… గత ఏడాది గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం కొద్దిరోజులకే ప్రమాద భరితంగా మారింది. దీంతో యంత్రాంగం తక్షణం నిమజ్జనం చెయ్యాలని పట్టుబట్టి ఆ తంతు పూర్తి చేయించింది.. కానీ, ఇప్పుడు గాజువాకలో పోటాపోటీ విగ్రహాలు రెడీ అయ్యాయి. వీటిలో బెల్లం గణపతి బరువు ఎక్కువ. దీంతో నమూనా సిద్ధం చేసిన దగ్గర నుంచి విగ్రహం రెడీ అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వహకులు చెబుతున్నారు. అ గాజువాక శ్రీనగర్ పరిధిలో మరో 89 అడుగుల విగ్రహం వెలిసింది. ఈ సారి చవితి వేడుకల్లో అయోధ్య రామమందిరం, కల్కి, పుష్ప సినిమా హీరోల అవతారంలో వినాయకుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే సీఎం చంద్రబాబు వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్నారు. వారం రోజుల నుంచి ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే మకాం వేసి వరద సహయక చర్యలపై సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలోనే వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సీఎం నిర్ణయించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే వినాయక పూజకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. వినాయక చవితిపై వరద ప్రభావం పడింది. వరద ప్రభావిత ప్రాంతంలోనూ వినాయక చవితి వేడుకలు జరగనున్నాయి. వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి అమ్మకాలు కొనసాగుతున్నాయి. వరద ఎఫెక్ట్‌తో మందకొడిగా ఉందని దుకాణాదారులు పేర్కొంటున్నారు.
ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన రెండతస్తుల ఓ లగ్జరీ ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్‌తో పాటు భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. సంగీత- సందీప్ విల్లా అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు వెల్లడైంది. ఇక, ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ ఫ్యామిలీతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెప్పుకొచ్చారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించినట్లు, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణ గుప్పించాయి. మొత్తం 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక, జూనియర్ డాక్టర్ హత్యాచార, హత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్‌కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు విచారణను సైతం సీబీఐకే హ్యండోవర్ చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల 8 రోజల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్ట్ సీరియస్..!
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కమ్రంలో సంజయ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా, శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? లాయర్ కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం.. ఇలా చేయటం దురదృష్టకరం అంటూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై మండిపడింది. అయితే, సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున లాయర్ కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు ఆటంకం కలిగిస్తుందని న్యాయస్థానికి తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ ను తిరస్కరించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10న అరెస్ట్ చేయగా.. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.
థర్డ్ అంపైర్ లేకుండానే టీ20 సిరీస్.. ఇదెక్కడి విడ్డూరం..!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్ జరిగితే ఇద్దరూ ఫీల్డ్ అంపైర్‌లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా విధులు నిర్వహిస్తారు. ఈ విషయం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి తెలుసు.. కానీ ఓ ఇంటర్నేషనల్ సిరీస్ కు థర్డ్ అంపైర్ లేకుండానే కొనసాగుతుంది. అవును మీరు విన్నదే నిజమేనండి బాబు. ఎడిన్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు థర్డ్ అంపైర్ గా ఎవరు ఉండటం లేదు. థర్డ్ అంపైర్‌తో పాటు డీఆర్‌ఎస్ కూడా అందుబాటులో లేదన్న మాట. థర్డ్ అంపైర్ అందుబాటులో లేకపోవడంతో రనౌట్, స్టంపౌట్‌లపై ఫీల్డ్ అంపైర్‌లదే ఇక తుది నిర్ణయం. కాగా, థర్డ్ అంపైర్ లేకపోవడంతో రెండో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌కు కలిసి వచ్చింది. మెక్‌గర్క్ స్టంపౌట్ ఔటైనప్పటకి ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో మెక్‌గర్క్ ఔటయ్యే ప్రమాదం నుంచి కొద్దీలో తప్పించుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ క్లాస్ టీమ్ ఆడుతున్న సిరీస్‌కు మూడో అంపైర్ లేకపోవడం అందరిని తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇక వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయం సాధించిన కంగారు జట్టు.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.