Same-sex Marriage: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం చట్టబద్ధమైన గుర్తింపుకు నిరాకరించింది. దీనిపై చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదే అని స్పష్టం చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెల్లడించింది. స్వలింగ పెళ్లిళ్లు చేసుకునే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.
Read Also: Beers: తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన యూబీఎల్..
అయితే, ఈ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. గతంలో ఇచ్చిన తీర్పులో తప్పు కనిపించడం లేదని, జోక్యం అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను తోసిపుచ్చింది.
అక్టోబర్ 2023లో, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించింది. 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. దత్తతకు వ్యతిరేకంగా, ఇలాంటి జంటల సంబంధాన్ని ‘వివాహం’గా చట్టబద్ధంగా గుర్తించకుండా, వారి హక్కులు, అర్హతలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వలింగ జంటలకు సివిల్ యూనియన్లను అనుమతించడానికి కూడా కోర్టు నిరాకరించింది.