Pakistan: అత్యాచారానికి ప్రతీకారంగా తమ తండ్రిని హత్య చేశారు అక్కాచెల్లెల్లు. ఇద్దరు టీజేజ్ సోదరీమణులు తమ తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో పంజాబ్ నగరమైన గుజ్రాన్‌వాలాలో జరిగింది. జనవరి 1న దాడి జరగగా, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ..
తండ్రి తమపై చేస్తున్న అఘాయిత్యాలకు పరిష్కారంగా తమ తండ్రిని చంపేయాలని అనుకున్నారు. ఇద్దరు బైక్ నుంచి పెట్రోల్ తీసుకుని, నిద్రిస్తున్న తండ్రిపై పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. సవతి అక్కాచెల్లెల్లైన ఇద్దరిపై, తండ్రి ఏడాది కాలంగా అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. పెద్ద కూతురుపై ఏడాది కాలంగా అత్యాచారం చేస్తుండగా, చిన్న అమ్మాయిపై రెండుసార్లు అత్యాచారాని ప్రయత్నించాడు. ఈ వేధింపుల గురించి బాధిత వ్యక్తి ఇద్దరు భార్యలకు కూడా తెలుసు. అయినా వారు ఈ వేధింపులను ఆపలేదు. ఈ కేసులో ఒక భార్యని అరెస్ట్ చేయగా, రెండో భార్యని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.