Tomorrow’s ‘Vikrant Rona’ Pre-Release Function!
కిచ్చా సుదీప్ హీరోగా రూపుదిద్దుకుంది ‘విక్రాంత్ రోణ’ చిత్రం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ కన్నడ త్రీడీ మూవీ ఈ నెల 28న వివిధ భారతీయ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు నిర్మాతలు షాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో ఈ నెల 26న జరుపుబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ, పార్క్ హయత్ లో ఉదయం 10.00 నుండి జరిగే ఈ వేడుకకు తెలుగు సినీ ప్రముఖులు పలువురు హాజరు కానున్నారు. అలానే మా కథానాయకుడు కిచ్చా సుదీప్ సైతం దీనికి రాబోతున్నారు. ‘ఈగ’ సినిమా నుండి సుదీప్ కు తెలుగులోనూ విశేషంగా అభిమానులు పెరిగారు. ఆ ఉద్దేశ్యంతోనే ‘విక్రాంత్ రోణ’ను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం. అనూప్ భండారి ఈ సినిమాను భారీ స్థాయిలో అత్యద్భుతంగా తెరకెక్కించారు అని తెలిపారు.