మాములుగా మనం రెస్టారెంట్ కు ఎందుకు వెళ్తాం… ఫుడ్ తినడానికి.. కానీ చెంప దెబ్బలు తినడానికి వెళ్తారా? చచ్చినా వెళ్లరు..అయితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్ మాత్రం భోజనంతో పాటు రెండు చెంపలు వాయించే సేవలను అందిస్తోంది.. ఇదేం పిచ్చిరా బాబు అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. రెస్టారెంట్‌లో చెంపలు వాయించడం ఏంటి.? డబ్బులు చెల్లించి మరీ కొట్టించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా. పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త ముందుకు వెళ్ళాల్సిందే..
వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని నగోయా నగరంలో.. సాచిహోకో-యా ఇకజయా అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌లో టిఫిన్స్, మీల్స్‌తో పాటు ప్రత్యేక సేవలు సైతం అందిస్తున్నారు. అదే చెంప దెబ్బలు. అవునండి.. కస్టమర్లు డబ్బులు చెల్లించి మరీ చెంప దెబ్బలు తింటున్నారు. అందమైన అమ్మాయిలు వరుసలో నిలబడి మరీ చెంప చెల్లుమనిస్తారు. ఇందుకోసం 300 యెన్‌లో చెల్లించాల్సి ఉంటుంది… అంటే రూ.170 రూపాయలు..
జపాన్‌లోని ఈ రెస్టారెంట్‌కు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అసలు ఇలా చెంపలు వాయించుకుంటే ఏం వస్తుందనేగా.. దీని ద్వారా తమ ఒత్తిడి దూరమవుతుందని ఇక్కడికి వస్తున్న వారు చెబుతున్నారు.. ఎలా చెంప దెబ్బలు తింటారో అన్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది..దాంతో అధికారులు షాక్ ఇచ్చారు.. పొరపాటున సున్నితంగా ఉండే చెవి ప్రాంతంలో దెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్న కారణంతో ఇలాంటి వాటిని మానుకోవాలని గట్టిగానే హెచ్చరించారంటా. దీంతో సదరు రెస్టారెంట్ ఈ సేవలను ఇటీవల ఆపేసినట్లు తెలుస్తోంది. ఒక లుక్ వెయ్యండి..