Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన “సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్” సినిమా గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రభాస్ కు మిత్రుడిగా నటించాడు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాకు సీక్వెల్‍గా ‘సలార్ 2: శౌర్యాంగపర్వం’ మూవీని కూడా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సలార్ మూవీ క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండటంతో సలార్ 2పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొని ఉంది.అయితే ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ మధ్య కొన్ని క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకే ఈ సినిమా ఆగిపోయిందని రూమర్స్ వైరల్ అయ్యాయి.
Read Also :Anjali : “రత్నమాల” పాత్రలో నటించడానికి కారణం అదే..?
తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సలార్ మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ “వాళ్లు నవ్వు ఆపలేకపోతున్నారు” అని రాసుకొచ్చింది.ఈ ఫొటోతో రూమర్లకు సలార్ టీమ్ తనదైన స్టైల్ లో స్పందించింది. సలార్ 2 క్యాన్సిల్ అయిందన్న రూమర్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయని రూమర్స్ పై మేకర్స్ ఫన్నీ గా స్పందించారు. సలార్ 2 నే తన తరువాత సినిమా అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తెలిపారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తామని ఆయన అన్నారు.అయితే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గురించి ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో సలార్ 2 రద్దయిందనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే, అలాంటిదేమీ లేదని, సలార్ 2 సినిమా కచ్చితంగా ఉంటుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
They can't stop laughing 😁
#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx
— Salaar (@SalaarTheSaga) May 26, 2024