ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నేడు హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని ముంబై, స్మృతి మంధాన కెప్టెన్సీలోని బెంగళూరు పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్లో గుజరాత్ను ఓడించి ముంబై జోరుమీద ఉండగా, ఢిల్లీపై ఓడిన బెంగళూరు ఇవాళ బోణీ కొట్టాలని ఆరాటపడుతోంది. నేడు సాయంత్రం 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా టాప్ ప్లేయర్ల కెప్టెన్సీలో మ్యాచ్ జరగనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. కౌర్ సూపర్ ఫామ్ లో ఉంది. ఆమెను నిలువరించడంపైనే ఆర్సీబీ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇక తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన ఆర్సీబీ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఢిల్లీపై మంధాన 35 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఇరు జట్ల కెప్టెన్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు.
Also Read : 5K Run : షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్.. పాల్గొన్న సీఎస్, డీజీపీ
బౌలింగ్ పరంగా ఇంగ్లాండ్ హాఫ్ స్పిన్నర్ హీథర్ నైట్ గనుక మరోసారి రాణిస్తే ముంబైకి ఇబ్బంది ఎదురవుతుంది. బ్యాటింగ్ పరంగా కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. ఇక ముంబైలో మరో ప్లేయర్ అమేలియా ఫామ్ లో ఉంది. గుజరాత్ పై 45 రన్స్ చేసింది. మరో వైపు ముంబై ఇండియన్స్ లో సైకా ఇషాక్ తన బంతులతో మ్యాజిక్ చేస్తోంది. కేవలం 3.1 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసింది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది ఆర్సీబీ.
Also Read : Project K: యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో అమితాబ్ కి ప్రమాదం…