Ponguleti, Jupalli: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వారిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖతతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీ రాగానే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతో కలిసి.. ఈ అంశంపై చర్చించి పొంగులేటి, జూపల్లిని అధికారికంగా కాంగ్రెస్‌లో చేర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనలో వారు ఉన్నట్టు సమాచారం.
Read also: Sharad Pawar: కొత్త పార్లమెంట్ నిర్మించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదు..
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆ ఇద్దరు నేతలు తమ అభిమానులు, కార్యకర్తలకు ఇప్పటికే అటువంటి సంకేతాలిచ్చారు. ఈనెల 12న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం ఈనెల 20వ తేదీ లేదా 25వ తేదిన ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్‌లో కలవాలని నిర్ణయించినట్టు సమాచారం. రాహుల్ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read also: Ileana : బికినిలో బేబీ బంమ్స్ తో ఇలియానా హాట్ ట్రీట్..
పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్ పలు కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిద్దరికి టికెట్లు ఫిక్స్ చేయడంతో పాటు అనుచరులకు కూడా టికెట్లలో ప్రాధాన్యత ఇస్తామని హామీ లభించినట్లు సమాచారం. అలాగే తమతో పాటు ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను వారిద్దరు తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను తమతో తీసుకొచ్చేందుకు వారిద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేతల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.