Prabhas: తిరుపతిలోనే నా పెళ్లి.. కృతిని చూసాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: ఆదిపురుష్ కోసం తాము చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నేడు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ చాలా ఎక్కువసేపు మాట్లాడి షాక్ ఇచ్చాడు. సాధారణంగా అయితే ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు. అయితే ప్రతిసారి అభిమానులు ఎక్కువసేపు మాట్లాడాలని కోరుతుండగా.. ఈసారి ఎక్కువసేపు మాట్లాడి వారిని ఆనందపరిచాడు. ఇక ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ.. ” ఆదిపురుష్ సినిమా మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు. ట్రైలర్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఓం రౌత్ నే ట్రైలర్ ను అభిమానుల మధ్యనే రిలీజ్ చేయాలనీ చెప్పాడు. అప్పుడు నేను ఒకసారి మా ఫ్యాన్స్ కు 3డీలో వేసి చూపించమన్నాను. మీ అందరికీ నచ్చింది అంటే ఓపెనింగ్ కలక్షన్స్ అదిరిపోతాయి. ఓం రౌత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తిండి, నిద్ర, కుటుంబం మొత్తం వదిలేసి ఏడు నెలలు శ్రమించాడు. సినిమా కోసం టీమ్ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్ చేయడం మా అదృష్టం.
Kriti Sanon: ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏం కాదు..
Also Read
ఇక నన్ను..రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అవును అని చెప్పాను. అలాంటి అదృష్టం చాలాతక్కువమందికి దొరుకుతుంది. నీ అదృష్టంగా భావించు అని అన్నారు. నిజంగా ఈ సినిమా దొరకడం నా అదృష్టం. ఇక ఈ సినిమాలో జానకిమా గా నటించిన కృతి.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అలా సీతగా కూర్చొని కంటినుంచి కన్నీళ్లు పెట్టుకున్న ఆ లుక్ చూసి.. కృతితో అన్నాను ఏం ఎక్స్ ప్రెషన్ అమ్మా ఇది.. అసలు ఒక్క ఎక్స్ ప్రెషన్ తో సీతమ్మ అని అందరి చేత అనిపించుకుంది. సీత క్యారెక్టర్ కోసం చాలా సెర్చ్ చేశారు. ఏ హీరోయిన్ కు అయితే మంచి పేరు ఉందో .. మంచి అమ్మాయి.. ఆ అమ్మాయే కృతి. ఇక సినిమాలో నటించిన లక్ష్మణుడు, హనుమంతుడు.. వారు లేకపోతే ఆదిపురుష్ లేదు. మాములు దానికంటే ఎక్కువ మాట్లాడాను.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై తక్కువ మాట్లాడి.. ఎక్కువ సినిమాలు చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మధ్యలో ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి గురించి అడుగగా.. ప్రభాస్ ఖచ్చితంగా నేను ఇక్కడే చేసుకుంటా.. నా పెళ్లి తిరుపతిలోనే.. త్వరలో అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!