టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ మూవీకి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందించారు..ఈ మూవీ సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందు అంటే జనవరి 14న రిలీజైంది. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ మరియు సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మలయాళం రీమేక్ తో వస్తున్న నాగార్జున కు హిట్ సాధ్యమేనా అని అంతా అనుకున్నారు. కానీ నాగ్ మరోసారి సంక్రాంతి సక్సెస్ సాధించాడు.హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీ నా సామిరంగనే. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లతో మొదలుపెట్టిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోయింది..
ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ ఓటీటీ హక్కుల ద్వారా కూడా నా సామిరంగ టీమ్ బాగానే సంపాదించినట్లు సమాచారం.ఇక మూవీని ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి హాట్‌స్టార్ సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగ మూవీ రన్ దాదాపు ముగిసింది. దీంతో మూవీ థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకురానున్నారు.నా సామిరంగ మూవీ సక్సెస్ మీట్ ను ఈ మధ్యే హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి మొత్తం టీమ్ అంతా హాజరు అయింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. నా సామిరంగ చేస్తున్నానంటే చాలా మంది నవ్వారని సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టిన మూవీ సంక్రాంతికి రిలీజ్ ఎలా సాధ్యమని వాళ్లు ప్రశ్నించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.నా ఫ్యామిలీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ మేము మూడు నెలల్లోనే సినిమాను చేశాం. రిలీజ్ కూడా చేశాం. ఇప్పుడు సక్సెస్ టీమ్ కూడా పెట్టుకున్నాం” అని నాగ్ తెలిపారు..