Gold Rate on 2023 December 12th in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల నెలల్లో వరుసగా పెరుగుతూ గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం ధరలు.. కాస్త దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు భారీగా పడిపోతుండడంతో.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నేడు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1983 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిన్నటితో రోజుతో పోలిస్తే ఈరోజు 20 డాలర్లకుపైగా పడిపోయింది.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 62,130లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,050గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,280 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,500గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,730 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది.
Also Read: Astrology: డిసెంబర్ 12, మంగళవారం దినఫలాలు
మరోవైపు వెండి ధర కూడా నేడు తగ్గింది. మంగళవారం కిలో వెండిపై రూ. 200 తగ్గి రూ. 75,800గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,800గా ఉంది. చెన్నైలో రూ. 77,800 వద్ద వెండి ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 73,800గా ఉండగా.. హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో రూ. 77,800 వద్ద కొనసాగుతోంది.