బంగారం ధరలు దడ పుట్టిస్తు్న్నాయి. ధరలు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ లవర్స్ కు షాకిస్తు్న్నాయి. తులం గోల్డ్ ధర రోజు రోజుకు వందల్లో పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న తులం గోల్డ్ ధర రూ. 400 పెరగగా.. నేడు బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 440 పెరిగింది. తమ ప్రియమైన వారికి బంగారు ఆభరణాలు గిఫ్ట్ గా ఇవ్వాలనుకునే వారికి గోల్డ్ ధరలు సవాల్ విసురుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:Aditi Shankar : ఎల్లోరా శిల్పంలా మెరుస్తున్న అదితి శంకర్
హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,044, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,290 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 82,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరగడంతో రూ. 90,440 ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90,590 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Salaar : సలార్ రీ-రిలీజ్ బుకింగ్స్ జెట్ స్పీడ్..
బంగారంతోపాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. నేడు సిల్వర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,14,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,05,000 వద్దకు చేరింది.