పసిడి ధరలు దిగొస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు భారీగా పడిపోయాయి. ఒక్కరోజులోనే తులం బంగారంపై ఏకంగా రూ. 1,140 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,037, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,050 తగ్గింది. దీంతో రూ. 92,000 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1140 తగ్గింది. దీంతో రూ. 1,00,370 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Indian 3 : భారతీయడు మరోసారి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు
విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,150 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,520 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు కిలో సిల్వర్ పై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,19,800 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,09,800 వద్ద ట్రేడ్ అవుతోంది.