బంగారం ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. నేడు మళ్లీ పెరిగాయి. ఇవాళ తులం బంగారం ధర రూ. 160 పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,260, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,405 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ.94,050 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 160 పెరిగింది. దీంతో రూ. 1,02,600 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,200 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,750 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,20,000 వద్ద ట్రేడ్ అవుతోంది.