Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారినిర్వహిస్తున్న తుక్కుగూడ సభను సక్సెస్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. ఈసారి ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టబోతుంది.
Read Also: Komati Reddy Venkat Reddy: నా పేరు తీసే అర్హత కేసీఆర్కు లేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తే..!
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్లు సభా స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ప్రతి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 10 లక్షల మంది జనాలను సమీకరించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందులో ప్రధానంగా లక్ష మంది మహిళలను వేదిక ముందు వరసలో కూర్చో బెట్టి, రాష్ట్రంలో అమలవుతున్న ఆరు పథకాలకు ధన్యవాదాలు చెప్పించేందుకు తగిన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తుంది. దీంతో పాటు 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించగా దాని కోసం 70 ఎకరాల్లో సభ ప్రాంగణం కేటాయించగా.. 550 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేసింది. అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
Read Also: Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..
ఇక, తెలంగాణ రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహా రచన చేస్తున్నారు. అలాగే, గెలుపు కోసం మండల స్థాయి మొదలు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టు సాధించి పార్టీ అధిష్టానానికి మరోమారు తన సత్తా ఏంటో చూపించాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. లోక్‌సభ షెడ్యూల్ రిలీజైనప్పటి నుంచి ఇంటి నుంచే తన పని చేస్తున్నాడు. లోక్ సభ ఎన్నికలలో పార్టీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానికి అనుగుణంగా రేవంత్‌రెడ్డి కార్యాచరణ చేస్తున్నాడు. ఇందు కోసం ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలకు ప్రభుత్వ సలహాదారుతో రాయబారం పంపిస్తున్నాడు.
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!