Today (01-02-23) Stock Market Roundup: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై రెండు విధాలుగా వ్యక్తమైంది. సెన్సెక్స్ లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది. రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్దఎత్తున అప్ అండ్ డౌన్స్‌కి గురయ్యాయి. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి.