To Protest Potholes: ఇటీవల కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయం అయ్యాయి.. రోడ్డు ఎక్కామంటే ఇంటికి జాగ్రత్తగా చేరుతామనే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది.. అయితే బిహార్‌లో రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు సమస్తిపూర్ వాసులు. హాజీపూర్-బచ్వారా వెళ్లే జాతీయ రహదారి -122ని బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం మొహియుద్దీన్ నగర్ మార్కెట్ సమీపంలోని రహదారిపై ఉన్న మురికి నీటిలోనే కూర్చుని నిరసన చేపట్టారు. గత మూడు రోజులుగా నిరసన చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదని ఓ నిరసనకారుడు తెలిపారు.
Hundred Crores Cheque: హుండీలో రూ.100 కోట్ల చెక్కు…. ఆరా తీసిన అధికారులకు షాక్
తాము మూడు రోజుల నుంచి నిరసన చేపడుతున్నామని, గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తు్న్నారు. జాతీయ రహదారి -122ను బాగు చేయడానికి కాంట్రాక్టర్‌కు రూ.25 లక్షలు మంజూరు అయ్యాయని.. అయినా పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆరోపించారు. రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. జాతీయ రహదారి-122 టెండర్ ప్రక్రియ పూర్తయిందని.. హైవేపై గుంతల మరమ్మతులు ప్రారంభమయ్యాయని.. కొంచెం సమయం పడుతుందని ఓ అధికారి వివరించారు.