జూన్ 4, 2024. దేశ ప్రజలకు ఎంత ప్రాముఖ్యమైన రోజో అందరికీ తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరో తేలిపోనుంది. ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. ఈవీఎంల బాక్స్‌లు తెరవడానికి కొన్ని గంటల సమయమే మిగిలుంది. ఇందుకోసం దేశ ప్రజలంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీవీలకు అతుక్కుపోయి.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన ఆగని హింస.. దాడుల పరంపర
అయితే మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగనుంది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎవరికెన్ని సీట్లో వస్తాయో ఒక అంచనాకు వచ్చేశాయి. దీంతో ఆయా పార్టీలు సంబరాలకు సిద్ధపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో స్వీట్ షాపులు కళకళలాడుతున్నాయి. ప్రాముఖ్యంగా యూపీలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు విజయోత్సవ వేడుకలకు సిద్ధపడిపోయారు. ముందుగానే స్వీ్ట్స్ షాపులకు వెళ్లి లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో లడ్డూకి భారీగా గిరాకీ పెరిగింది. మరికొన్ని చోట్ల లడ్డూలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బాణసంచా, రకరకాలైన మిఠాయిలు కొనుగోళ్లతో ఆయా ప్రాంతాలు సందడి సందడి నెలకొన్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇక చివరి దశ జూన్ 1న ముగిసింది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న, అనగా మంగళవారం విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆయా పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగల్సిందే.
#WATCH | Agra, UP: Ahead of Lok Sabha election result day, the demand for 'Laddu' increases as workers of different parties prepare for their candidate's victory celebrations. pic.twitter.com/45dxMPA3ux
— ANI (@ANI) June 3, 2024
#WATCH | Uttar Pradesh: Agra Brij Rasayanam Mishthan Bhandar owner Umesh Gupta says, "…We are getting the orders of laddu from the parties that are sure of their candidate's victory… We are preparing 11 different types of Laddus for the result day celebration." https://t.co/K3LOw5SmZb pic.twitter.com/iEkWSx4jVM
— ANI (@ANI) June 3, 2024