Titan Celestor Smartwatch Price in India: ప్రముఖ వాచ్ కంపెనీ ‘టైటాన్’ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఓవైపు తన సబ్ బ్రాండ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ వాచ్‌లను తీసుకొస్తూనే.. మరోవైపు టైటాన్ పేరుతో కూడా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది. తాజాగా అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘టైటాన్ సెలెస్టార్’ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఇది వృత్తాకార అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. టైటాన్ సెలెస్టార్ ధర, ఫీచర్స్ వివరాలను ఓసారి తెలుసుకుందాం.
టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 9,995గా కంపెనీ నిర్ణయించింది. ఇది బ్లాక్ ఎక్లిప్స్, అరోరా బ్లూ మరియు మూన్‌లైట్ ఎడిషన్‌లో అంబాటులో ఉంటుంది. టైటాన్ షోరూమ్‌తో పాటు అమెజాన్ ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా, కంపెనీ స్మార్ట్ వాచ్‌పై అదనంగా రూ. 1,000 తగ్గింపును కూడా ఇస్తోంది.
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
టైటాన్ సెలెస్టర్ వాచ్‌లో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. 750 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. దీంతో ఈ స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే సన్‌లైట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్‌గా జీపీఎస్ ఉంటుంది. మై ఫిట్‌నెస్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో మీ ఫిట్‌నెస్ వివరాలను తెలుసుకోవచ్చు. స్లీక్ అల్యూమినియం బాడీతో ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఏఐ డ్యాష్‌బోర్డ్‌ను ఇందులో అందించారు. బ్యాటరీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది.