Gold Rate Today on 18 July 2024 in Hyderabad: మగువలకు శుభవార్త. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గింది. గురువారం (జులై 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.74,840గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,990గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.68,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,840గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.69,050గా.. 24 క్యారెట్ల ధర రూ.75,330గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.68,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.74,840గా ఉంది.
Also Read: IND vs SL: యాక్షన్ మొదలెట్టిన గంభీర్.. రోహిత్‌కు ఫోన్! మరో ప్లేయర్‌పై వేటు
వెండి ధరలు కూడా నేడు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1300 తగ్గి.. రూ.94,700గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.94,700గా ఉండగా.. ముంబైలో రూ.94,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.99,200లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.94,850గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.99,200లుగా నమోదైంది.