Tirupati Students : తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల ఆచూకీ లభించింది. వారంతా ఆగ్రా సమీపంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతానికి వారంతా యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు. తిరుపతిలోని అన్నమయ్య స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యారు. పిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో తిరుపతి పడమర పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికే పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రాకు చేరుకున్నాయి. ఈ నెల 9వ తేదీ ఉదయం స్టడీ అవర్ అని చెప్పి స్కూల్ కి వెళ్లిన పిల్లలు తరువాత కనిపించకుండా పోయారు.
Read Also: Airplane Stuck Under Bridge: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం.. భారీగా ట్రాఫిక్ జామ్
విద్యార్థులు రైలు ఎక్కినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. తాజ్ మహల్ చూడడానికి విద్యార్థులు ఆగ్రాకు వెళ్లారా? లేదా వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియాల్సి ఉంది. విద్యార్థుల మిస్సింగ్ తిరుపతి జిల్లాలో కలకలం రేపింది. నెహ్రూ నగర్‌లో ఉన్న శ్రీ అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9వ తేదీన ఉదయం స్టడీ అవర్స్ పేరుతో పిల్లలు స్కూల్ కి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లలేదు.