తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Also Read: Schools Bandh: అలర్ట్.. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్!
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున కావడంతో భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షాపులో ఉన్న ఇత్తడి సామాన్లులు, బొమ్మలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో మరో షాపు కూడా దగ్దమైంది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.