Ram mandir: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. హైదరాబాద్‌లో హైఅలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir Inauguration: ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్పీ), పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే, పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP), గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది.
Read Also: Cheteshwar Pujara: చెతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయి!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అయితే, గత వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయిలో వరుస శాంతి సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులు బాస్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. హైదరాబాద్‌లో స్థానిక పోలీసులకు సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కమిషనర్ టాస్క్ ఫోర్స్, TSSP అండ్ మౌంటెడ్ పోలీసులు మద్దతు ఇస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా
అలాగే, మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో పోలీసు పికెట్లను భారీగా మోహరించినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు నిర్వహించే ప్రదేశాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు. ఇక, సీనియర్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని మతపరమైన సున్నిత ప్రాంతాలలో విడిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండాలని వెల్లడించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!