Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pending Challans: పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ గడువును తెలంగాణ పోలీసులు ఇప్పటికే పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ఆఫర్ గతేడాది డిసెంబర్ 27 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇంకా చాలా చలాన్లు చెల్లించాల్సి ఉండడంతో డిస్కౌంట్ ఆఫర్ ను జనవరి 31 వరకు పొడిగించారు.అయితే.. మరో నాలుగు రోజుల్లో ఈ గడువు ముగియనుండడంతో.. వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఈ డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
జనవరి 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత పూర్తి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే చెల్లించి డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక.. పెండింగ్ లో ఉన్న చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
Read also: IND vs ENG: ఉప్పల్ టెస్ట్.. రోహిత్ శర్మ పాదాలు తాకిన అభిమానికి 14 రోజుల రిమాండ్!
అయితే ఇది మొత్తం 42.38 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు చెల్లించిన చలాన్ల ద్వారా రూ.135 కోట్ల ఆదాయం సమకూరినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 34 కోట్లు, సైబరాబాద్‌లో 25 కోట్లు, రాచకొండలో 16 కోట్లు కాగా.. అయితే వాహనదారుల నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు పోలీసులు ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించారు. గతంలో ప్రకటించినప్పుడు.. వాహనదారుల స్పందన చూసి.. ఈసారి మళ్లీ అదే అవకాశం కల్పించారు పోలీసులు. ఇందుకోసం.. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.
డిసెంబర్ 25 వరకు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను 15 రోజుల ముందుగానే రాయితీ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయితే.. సింబాలిక్ కారణాలు, ఇతరత్రా కారణాల వల్ల.. చాలా వరకు చలాన్లు వసూలు కాలేదు. దీంతో ఈ ఆఫర్ గడువును జనవరి 31 వరకు పొడిగించారు.అయితే చాలా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇక.. డిస్కౌంట్ ఆఫర్ గడువును పొడిగించే అవకాశం లేదని.. జనవరి 31 చివరి తేదీ.. అని చెప్పారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించని వారు చెల్లించాలని సూచించారు.
TTD Board Meeting: రేపు టీటీడీ పాలకమండలి సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!