Case Filed on Daggubati Family: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ సహా దగ్గుబాటి కుంటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. నంద కుమార్ పిర్యాదు మేరకు విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు ఇంట్లో విషాదం!
దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను దిక్కరించి ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ద్వసం చేసి.. ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. దగ్గుబాటి కుంటుంబ సభ్యులు అక్రమంగా నిర్మాణాలు చేశారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఫిల్మ్ నగర్ సీఐకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు.. దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేస్ నమోదుకు ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ 448, 452, 380, 506,120b సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.