Thyroid Diet Tips: థైరాయిడ్ సమస్యలు నేటి కాలంలో చాలా మందిని బాధిస్తున్నాయి. మన మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్లు మెటబాలిజం, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన, బరువు, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవే హైపోథైరాయిడిజం (Hypothyroidism), హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism). హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంధి తక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల శరీర క్రియలు మందగించడం, బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. హైపర్ థైరాయిడిజం అంటే అధిక హార్మోన్లు ఉత్పత్తి కావడం వల్ల బరువు తగ్గడం, గుండె వేగం పెరగడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Hyderabad : హైదరాబాద్‌లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లలో కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడం లేదా మందుల ప్రభావాన్ని తగ్గించడం చేస్తాయి. ముఖ్యంగా క్రూసిఫెరస్ కూరగాయలు అనగా.. క్యాబేజీ, బ్రోకోలీ, కాలిఫ్లవర్, రాడిష్ (ముల్లంగి) వంటివి “గోయిట్రోజెన్స్” అనే పదార్థాలను కలిగి ఉండి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అలాగే సోయా ఉత్పత్తులు అయినా సోయా బీన్స్, సోయా మిల్క్, టోఫూ వంటి ఆహారాలు థైరాయిడ్ మందుల శోషణను అడ్డుకుంటాయి. అధిక ఉప్పు లేదా అయోడిన్ అధికంగా ఉన్న ఉప్పు కూడా హైపర్ థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవడం మంచిది కాదు.
అదే విధంగా ప్రాసెస్డ్ ఆహారాలు అయినా ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, బిస్కెట్లు, కేకులు వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్లు ఇంకా చక్కెరలు ఎక్కువగా ఉండి హార్మోన్ అసమతుల్యతను పెంచుతాయి. కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా థైరాయిడ్ మందులు తీసుకున్న వెంటనే తాగరాదు. కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా బరువు పెరగడానికి, హార్మోన్ స్థాయిలు అసమతుల్యం కావడానికి కారణమవుతాయి. హైపర్ థైరాయిడ్ ఉన్నవారు హై అయోడిన్ ఫిష్ (సీ వీడ్, సీ ఫిష్) వంటి వాటిని తగ్గించాలి.
అన్ని తినడం ఆపేయండి అంటే.. మరి ఏమి తినాలని అనుకుంటున్నారు కదా.. అక్కడికే వద్దాం.. గుడ్లు (పచ్చ సొనతో), వేరుశెనగలు, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, తాజా పండ్లు, పచ్చి కూరగాయలు, మిల్లెట్స్ (జొన్న, రాగి, సజ్జ), గోధుమ రొట్టెలు ఇవి అన్ని సంపూర్ణంగా తినవచ్చు. ఇవి హార్మోన్ల సంతులనం కాపాడటంలో, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, వ్యాయామం చేయడం కూడా థైరాయిడ్ నియంత్రణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
50MP కెమెరా, జెమినీ లైవ్ ఫీచర్స్, IP54 రేటింగ్‌తో Samsung Galaxy M17 5G లాంచ్..!
థైరాయిడ్ రకం (Hypo లేదా Hyper) ఆధారంగా ఆహార నియమాలు మారుతాయి. కాబట్టి వైద్యుడి సలహాతోనే డైట్ ప్లాన్ మార్చడం అత్యంత అవసరం. సరైన ఆహారం, వ్యాయామం, ఇంకా మందుల పద్ధతిని పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.