Thursday Remedies To Bring Good Health And Money: భారతీయ సంస్కృతిలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. గురువారంను విష్ణువు మరియు దేవగురు బృహస్పతికి అంకితం చేయబడింది. గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఇంట్లో సంపద, ఐశ్వర్యం తులతూగుతాయి. అంతేకాదు కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని చెబుతారు. జ్యోతిష్యుల ప్రకారం గురువారం శుభకార్యాలకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే గురువారం కొన్ని పనులు (Guruwar ke Tips) పొరపాటున కూడా చేయకూడదు. చేశారో విష్ణువు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
బట్టలు ఉతకరాదు:
గురువారం నాడు బట్టలు ఉతకడం లేదా ఇంటిని తుడవడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలహీనపడుతుందని, దీనివల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని చెబుతారు.
అరటిపండు తినకూడదు:
మత పండితులు ప్రకారం అరటి మొక్కను గురువారం నాడు నియమాలు మరియు నిబంధనల ప్రకారం పూజిస్తారు. అందుకే ఈ రోజు పొరపాటున కూడా అరటిపండు తినకూడదు.
పూజలు చేయొద్దు:
గురువారం తూర్పు, దక్షిణం మరియు నైరుతి ముఖంగా పూజలు చేయరాదు. ముఖ్యంగా పొరపాటున కూడా దక్షిణ దిక్కుకు అభిముఖంగా పూజ చేయకూడదు.
తల స్నానం చేయొద్దు:
వేదశాస్త్రాల ప్రకారం మహిళలు గురువారం తల స్నానం చేయరాదు. ఇలా చేయడం వల్ల పిల్లల సంతోషం మరియు వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుందని నమ్ముతారు.
Also Read: Salaries in Advance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. ఈ రాష్ట్రాల్లో ముందుగానే జీతాలు
కటింగ్ చేసుకోకూడదు:
గురువారం పురుషులు షేవింగ్ లేదా కటింగ్ చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం క్షీణిస్తుందని, ఇది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.
గోర్లు కత్తిరించకూడదు:
సనాతన ధర్మంలో గురువారం చేతులు మరియు కాళ్ళ గోర్లు కత్తిరించడం నిషేధించబడింది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని అంటారు. అంతేకాదు ఆదాయం కూడా తగ్గుముఖం పడుతుందట.