పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. హరిశ్చంద్రాపూర్‌లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా ప్రకటించారు.…
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదపు తప్పిన మినీ ట్రక్కు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా మరి కొంత మంది గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు