అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 6 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌కి చెందిన వారిగా సమాచారం.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.