Wizard: పిల్లలు లేని వేదనలో ఉన్న మహిళలే వీడి టార్గెట్. తాను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని ఎంతో మందిని నమ్మించాడు. చివరకు వారిని లైంగికంగా అనుభవించాడు. విషయం బయటకు తెలియకుండా ఏం చేయాలో అన్నీ చేశాడు. కానీ వీడి పాపం పండింది. ఎట్టకేలకు కేటుగాడి కామ కోరికలు బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే ఓ వివాహిత తాంత్రికుడు దగ్గరకు వచ్చి తనకు సంతానం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనోడు ఎప్పటి మాదిరిగానే ఆశలు కల్పించాడు. చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని నమ్మించించాడు. చివరకు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: TSPSC : పేపర్ లీక్ లో సంచలన విషయాలు.. వాట్సప్ చాట్ లో కొత్త లింకులు
పూర్తి వివరాల్లోకి వెళితే… బస్స్వాడకు చెందిన ముఖేష్ గార్సియా తాంత్రికునిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇటీవల అతనికి ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. సంతానం లేకపోవడంతో ఆమె ముఖేష్‌ను సంప్రదించింది. మరో నిందితుడు దిలావర్ షేక్ ఆమెను ముఖేష్ వద్దకు తీసుకెళ్లాడు. తనకు తెలిసిన తాంత్రిక ప్రక్రియతో సంతానం లేనివారు ఆశీర్వదించబడతారని ముఖేష్ గతంలో దిలావర్‌తో చెప్పాడు. ధనవంతులు కావాలనుకునే వారికి వరాలు కురిపిస్తానని చెప్పుకునేవాడు. దీంతో.. వివాహితను దిలావర్ షేక్ తన వద్దకు తీసుకెళ్లాడు. అతను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని ఆమెలో కొత్త ఆశలు రేకెత్తించాడు ముఖేష్.
Read Also:12Pages : 12పేజీల సూసైడ్ నోటు.. చదివితే షాకింగ్ విషయాలు
ఈ క్రమంలో ముఖేష్ ముందుగా బాధితురాలిని ఖేడా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మహిసాగర్ వెళ్లారు. ఆ తర్వాత ఆమెను రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని దాహోద్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తన దుకాణంలో తాంత్రిక ప్రక్రియ పేరుతో అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా పలువురు మహిళల బలహీనతను ఆసరాగా చేసుకుని నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మార్చి 16న షేక్ పోలీసులకు చిక్కాడు. ముఖేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.