ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఘటన మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో చోటుచేసుకుంది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో ఊగిపోయాడు. తన సర్వీస్ రైఫిల్‌తో ఎస్సైని పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి చంపాడు. కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఈ ఘటన అనంతరం కానిస్టేబుల్‌ను మిగతా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
READ MORE: Omar Abdullah: ఉగ్రదాడిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..
స్థానిక పోలీసు సమాచారం ప్రకారం..నవంబర్ 2 శనివారం రోజున ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని సంభవించింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కానిస్టేబుల్.. ఎస్సైని కాల్చినట్టుగా చెప్పాడు. ఇంతకీ గొడవకు కారణమేమిటనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.. నిందితుడు కానిస్టేబుల్‌ను డిపార్ట్ వెంటనే అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నారు.
READ MORE:Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)
ఈ ఘటనపై ఇంఫాల్‌లోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ప్రస్తుతం గట్టి భద్రతలో ఉన్న మోంగ్‌బంగ్ గ్రామ పోలీసు పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ బిక్రమ్‌జీత్ సింగ్ కోపంతో తన సర్వీస్ రైఫిల్ తో సబ్-ఇన్‌స్పెక్టర్ షాజహాన్‌పై కాల్పులు జరిపాడని, ఆయన అక్కడికక్కడే మరణించాడని అధికారి తెలిపారు.