పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌తో యాప్ ఆధారిత బైక్ డ్రైవర్ చేసిన సిగ్గుమాలిన చర్య సంచలనం సృష్టించింది. రైడ్ ఆలస్యం కావడంతో తన బుకింగ్‌ను క్యాన్సిల్ చేయగా, డ్రైవర్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని మహిళా డాక్టర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపు వంటి…