Naveen Vijaya Krishna: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ఫేమసే. ఇక పవిత్రా లోకేష్ తో నరేష్ నడిపిన ప్రేమాయణం వలన మరింత ఫేమస్ అయ్యాడు. వీరిద్దరూ ఈ వయస్సులో ప్రేమ, పెళ్లి అంటూ తిరగడం, వారిని అడ్డుకోవడం కోసం నరేష్ మూడో భార్య రమ్య రఘపతి మీడియాలో రచ్చ చేయడం తెల్సిందే. ప్రస్తుతం వీరు ఒకేదగ్గర కలిసి ఉంటున్నారని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే .. నరేష్ కు ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు అయిన విషయం అందరికి తెల్సిందే. అయితే నరేష్ కొడుకు కూడా ఒక హీరో అని, ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడని ఎవరికైనా తెలుసా .. ? అవును .. నరేష్ పెద్ద కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. నరేష్ కొడుకును హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.
Trending news: అయ్ బాబోయ్ ఎంత పొడుగో.. ట్రెండ్ అవుతున్న ఈ జంట
నందిని నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు, ఐనా ఇష్టం నువ్వు అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్. ఈ సినిమాలు ఏవి అతడికి అంతగా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. ఇక దీంతో సినిమాలు మనకు సెట్ అవ్వవు అనుకున్నాడో ఏమో.. తండ్రి బిజినెస్ లు చూసుకుంటూ ఉండిపోయాడు. చాలా గ్యాప్ తరువాత నవీన్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. సత్య అనే షార్ట్ ఫిల్మ్ కు దదర్శకత్వం వహించాడు. నవీన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన సాయి ధరమ్ తేజ్ ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించగా.. కలర్స్ స్వాతి హీరోయిన్ గా కనిపించింది. ఒకప్పుడు మంచి ఫిట్ గా ఉన్న నవీన్.. ఇప్పుడు బరువుపెరిగి కనిపించాడు. సడెన్ గా చూస్తే నవీన్ ను గుర్తుపట్టడం కష్టమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తేజ్ తో నవీన్ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు నవీన్ డైరెక్టర్ గా ఏమైనా సెటిల్ అవుతాడేమో చూడాలి.