లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌గఢ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత కొందరు దుండగులు హఠాత్తుగా బ్యాంకులోకి ప్రవేశించారు. తొలుత బ్యాంకు మేనేజర్‌ను కత్తితో పొడిచిన దుండగులు.. మిగిలిన బ్యాంకు ఉద్యోగులను బందీలుగా చేసుకుని నగదు, బంగారం, వెండితో పరారయ్యారు.
ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.