భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్యాంప్ ఆఫీస్ లో మాజీ ఎంపీ పొంగులేటి మరోసారి అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భద్రాచలం పరంగా ఇచ్చిన హామీల సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. నిన్న కేబినెట్ లో మున్నేరుకు సైడ్ వాల్స్ కడతామని చెప్పడం నాకు నవ్వొస్తుంది.. తెలంగాణ మనిషి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని అందరూ భావించారు.. కానీ అది నిరవేరలేదు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుండటం.. మరో మూడు నెల రోజుల్లో ఎన్నికలు ఉంటడంతో వీళ్లకు ఇప్పుడే గుర్తొచ్చిందా అని పొంగులేటి అన్నారు.
Read Also: UP CM Yogi Adityanath: నేరస్థులకు ప్రభుత్వం హారతి పట్టదు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
వర్షాలతో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతుంటే అదంతా వదిలేసి కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి ఆయన పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తున్నారు అని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీకు కేవలం అధికారముంటే చాలా..?ప్రజలు ఏమైపోయిన పర్వాలేదా..?.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు ముంపుగు గురైన వారికి చేదోడు వాదోడుగా ఉన్నందుకు అభినందనలు.. కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ఆయన తెలిపారు.
Read Also: CM KCR: అన్నాభావు సాఠే చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు
అధికార పార్టీ నేతలందరూ అనుకుంటున్నట్లు అధికారం ఎవరబ్బా సోత్తు కాదు అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి సపోర్టు వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.