Site icon NTV Telugu

Madhu Yashki: తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు

Madhuyashki

Madhuyashki

నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు. కేసీఆర్, నరేంద్ర మోడీ తెరవెనుక తెరముందు ఎట్లా అనేది చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా మాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించారు.. ఐదేళ్ల మిత్తి మాఫీ అయ్యింది అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Rains Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం

పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని మధుయాష్కీగౌడ్ తెలిపారు. తెలంగాణాలో దోపిడీ జరుగుతోంది.. అన్ని వర్గాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి మోసం చేస్తున్నారు.. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు.. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు అని మధుయాష్కీ అన్నారు. పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారని తెలియజేశాడు.

Read Also: Heaviest Animal: ప్రపంచంలోనే అత్యంత బరువైన జంతువు.. ఎంతుంటుందో తెలిస్తే షాకవుతారు..!

సత్యమేవ జయతే.. రాహుల్ విషయంలో సత్యం గెలిచింది అని ప్రచార కమిటీ ఛైర్మన్ తెలిపారు. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరం.. రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని చూసింది.. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కుట్రలు చేసి కాదు.. కేంద్ర విచారణ సంస్థలను ఉసిగొల్పి కాంగ్రెస్ నేతలను, సానుభూతి పరులను వేధిస్తున్నారు అని మధుయాష్కి విమర్శించారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడం లేదు అని అడిగారు.

Read Also: Tamannaah Bhatia: భోళా శంకర్, వేదాళం రీమేకే కానీ అంతా మార్చేశారు.. అసలు విషయం చెప్పేసిన తమన్నా

బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై జనాల్లోకి తీసుకెళ్తామని పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన విమర్శించారు. వారిని ఏవిధంగా కాపాడుకోవాలి అనే దానిపై చర్చ చేశామని ఆయన అన్నారు. కాంగ్రెస్ సానుభూతి పరులను కూడా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి తెలిపారు.

Exit mobile version