జన్వాడ్ ఫాంహౌస్ పార్టీకి సంబంధించి రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఫాంహౌస్ పార్టీకి సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు
హైదరాబాద్ శివార్లలో జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విజయ్ మద్దూరిని మోకిలా పోలీసులు విచారణ చేయనున్నారు. రాజ్ పాకాల ఇంకా పరారీలో ఉన్నారు.
హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫాం హౌస్కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో.. ఫాం హౌస్లో అధికారులు కొలతలు వేస్తూ పరిశీలించారు. కాగా.. గత కొద్దీ రోజులుగా జన్వాడ ఫాం హౌస్కు సంబంధించి చర్చ జరుగుతుంది.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆరేడు వేల ఓట్లు మైనస్ అయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారని.. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చానన్నారు.
జన్వాద ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు.