ఇటీవల స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా పడడం లేదా మారే ఇతర కారణాల వలన అయిన పోస్ట్ పోన్ అవడం కామన్ అయింది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 రిలీజ్ కు కొన్ని గంటల ముందు పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా అన్ని క్లియరెన్స్ తో ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మరోక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా పడింది. తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా వా వాతియార్ అనే సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమాను ‘అన్నగారు వస్తారు’గా తీసుకొస్తున్నాడు.
Also Read : Akhanda2 : 24 గంటల్లో బాలయ్య ఊచకోత.. నైజాం ఏరియాలో రికార్డు స్థాయి ఓపెనింగ్
వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ రిలీజ్ కాలేదు. అదే టైమ్ లో డిసెంబరు 12 వస్తామని ప్రకటించారు. కానీ అఖండ 2 వస్తుండడంతో 13 తేదీన వస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం లేదని ప్రకటించారు. అందుకు కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే ఈ బ్యానర్ లో వచ్చిన గత చిత్రం కంగువ భారీ ప్లాప్ అయింది. ఆ సినిమా తాలూకు నష్టాలు అలా ఉంటె వా వాతియార్ కోసం తీసుకున్న ఫైనాన్స్ ను క్లియర్ చేయలేదట జ్ఞానవేల్ రాజా. ఈ క్రమంలోనే ఇప్పడు రాబోతున్న వా వాతియార్ పై కంగువ నష్టాలతో పాటు ఫైనాన్స్ ప్రభావం పడింది. ఫైనాన్స్ క్లియర్ కాకపోవడంతో క్లియరెన్స్ లెటర్ రాకపోవడంతో ఉన్నట్టుండి ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. మరొక డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.