NTV Telugu Site icon

Sankranti 2025: పల్లెకు బైబై.. మళ్లీ పట్నం బాట.. రద్దీగా హైవేలు..

Toll Gate

Toll Gate

Sankranti 2025: సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండుగ పూట సొంత ఊరు వెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక, కోళ్ల పందాలు, గుండాట ఇలా పలు రకాల ఆటల్లో పాల్గొన్నారు.. కొందరు డబ్బులు పోగొట్టుకుంటే.. మరికొందరు డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు.. మరోవైపు.. పండగకు ముందు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..

Read Also: Maha Kumbh Mela 2025: కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్‌

దీంతో.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది.. సంక్రాంతి సంబరాలు ముగించుకొని హైదరాబాద్‌ తిరుగుప్రయాణం చేసే ప్రయాణికుల వాహనాలతో రద్దీగా మారిపోయాయి హైవేపై ఉన్న టోల్ గేట్లు.. గత మూడురోజులు సంబరాలు ముగిసిపోవడంతో తిరుగు ప్రయాణం అయ్యారు పట్టణవాసులు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూడా తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు.. హైదరాబాద్‌కు ఈనెల 19 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు రాజమండ్రి ఆర్టీసీ అధికారులు.. శని, ఆదివారాల్లో ప్రతి ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. మరోవైపు.. మొన్నటి వరకు వెళ్లేవారికి.. ఇప్పుడు సంక్రాంతికి వచ్చి తిరిగి వెళుతున్న ప్రయాణికులనుంచి టికెట్ల అధిక రేట్లతో దోపిడీ చేసే పనిలో పడిపోయాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌..

Read Also: Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు!

అయితే, సంక్రాంతి పండుగ ముగించుకుని నగరవాసుల తిరుగుపయనం పట్ల ప్రత్యేక ఏర్పాట్లుకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రయాణికుల జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు.. విజయవాడ నుండి ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాటు చేశామని.. ప్రయాణికులు అందరూ రవాణా భద్రతలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడుతపున్నారు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా స్పెషల్‌ సర్వీసులు నడుస్తున్నాయి.

Show comments