Sankranti 2025: పల్లెకు బైబై.. మళ్లీ పట్నం బాట.. రద్దీగా హైవేలు..
- ముగిసిన సంక్రాంతి పండుగ సంబరాలు..
- భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో తిరుగు ప్రయాణం..
- పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టిన ప్రజలు..
- రద్దీగా మారిన హైవేలు.. టోల్ గేట్ల దగ్గర రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti 2025: సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండుగ పూట సొంత ఊరు వెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక, కోళ్ల పందాలు, గుండాట ఇలా పలు రకాల ఆటల్లో పాల్గొన్నారు.. కొందరు డబ్బులు పోగొట్టుకుంటే.. మరికొందరు డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు.. మరోవైపు.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
Read Also: Maha Kumbh Mela 2025: కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
దీంతో.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది.. సంక్రాంతి సంబరాలు ముగించుకొని హైదరాబాద్ తిరుగుప్రయాణం చేసే ప్రయాణికుల వాహనాలతో రద్దీగా మారిపోయాయి హైవేపై ఉన్న టోల్ గేట్లు.. గత మూడురోజులు సంబరాలు ముగిసిపోవడంతో తిరుగు ప్రయాణం అయ్యారు పట్టణవాసులు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూడా తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు.. హైదరాబాద్‌కు ఈనెల 19 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు రాజమండ్రి ఆర్టీసీ అధికారులు.. శని, ఆదివారాల్లో ప్రతి ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. మరోవైపు.. మొన్నటి వరకు వెళ్లేవారికి.. ఇప్పుడు సంక్రాంతికి వచ్చి తిరిగి వెళుతున్న ప్రయాణికులనుంచి టికెట్ల అధిక రేట్లతో దోపిడీ చేసే పనిలో పడిపోయాయి ప్రైవేట్ ట్రావెల్స్..
Read Also: Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు!
అయితే, సంక్రాంతి పండుగ ముగించుకుని నగరవాసుల తిరుగుపయనం పట్ల ప్రత్యేక ఏర్పాట్లుకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రయాణికుల జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు.. విజయవాడ నుండి ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాటు చేశామని.. ప్రయాణికులు అందరూ రవాణా భద్రతలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడుతపున్నారు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా స్పెషల్ సర్వీసులు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!