* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం 12గంటలకి భేటీ..
* నేటి నుంచి ఏపీలో అవకాయ్- అమరావతి ఉత్సవాలు.. పున్నమి ఘాట్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకి జగన్ ప్రెస్ మీట్.. తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడనున్న జగన్..
* నేటి నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ పర్యటన.. 9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం.. పిఠాపురం వేదికగా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న పవన్.. 11న జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం.. పిఠాపురం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సందర్శనలు చేయనున్న పవన్..
* నేటితో తిరుమల శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు.. రేపటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ..
* నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన..
* నేటి నుంచి ఐదు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ ను ఏసీబీ కస్టడీకి అనుమతి.. రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ ను ఐదు రోజుల ఏసీబీ కస్టడీకి అప్పగించిన కోర్టు..
* నేటి నుంచి ఏపీలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపు.. ఇవాళ్టి ప్రిమియర్ షో టికెట్ ధర రూ. 1000గా నిర్ణయం.. సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12లోపు స్పెషల్ షోలకు అనుమతి.. రేపటి నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి.. సింగిల్ స్ర్కిన్లలో టికెట్ ధర రూ. 150కి పెంపు.. మల్టీప్లెక్స్ ల్లో రూ. 200 పెంచుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతి..
* నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా బృందం స్పేస్ వాక్.. కొత్త సోలార్ ప్యానెల్స్ అమరికకు అవసరమైన కిట్స్ ఇన్ స్టాలేషన్.. ఆరున్నర గంటల పాటు కొనసాగనున్న ప్రక్రియ..