Throwback Memories: టాలీవుడ్ సినియర్ నిర్మాతల్లో కాట్రగడ్డ మురారి ఒకరు. అప్పట్లో పలు హిట్ సినిమాలు తీసిన ఆయన ఈ ఏడాదిలోనే మృతి చెందిన విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి జీవితాలు అందరికి తెరిచిన పుస్తకమే అయినా అందులో కొన్ని పేజీలు ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోతాయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రం సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇక తాజాగా కాట్రగడ్డ మురారి జీవితంలో కూడా కొన్ని సీక్రెట్లు ఉన్నాయని.. అవి తన ఓల్డ్ ఇంటర్వ్యూలు చూసినప్పుడే బయటపడ్డాయి. మురారి.. తన కుక్కలకు హీరోయిన్ల పేరు పెట్టేవారట.. వారి మీద ఉన్న కోపాన్ని ఆ కుక్కల మీద తీర్చుకొనేవారట. ఈ విషయాన్నీ గతంలో ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
మురారి ఇంట్లో మూడు డాగ్స్ ఉన్నాయి. వాటి పేర్లు భానుమతి, రామకృష్ణ, గాయత్రీ. అయితే భానుమతి అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్.. ఆమె పేరు ఎందుకు కుక్కకు పెట్టాల్సి వచ్చింది మురారి చెప్తూ.. ” అప్పట్లో చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పుస్తకం రాయాలి అనుకున్నాను.. దీనికోసం రీసెర్చ్ చేయడానికి అందరి వద్దకు తిరిగి వారి అభిప్రాయాలను, సలహాలను కనుక్కోవడానికి వెళ్ళేవాడిని.. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న భానుమతి ఇంటికి వెళ్తే.. ఆమె చాలా రోజులు తిప్పించుకుంది.. అస్సలు మాట్లాడేది కాదు. దీంతో ఆమె మీద నాకు కోపం వచ్చింది. ఆ సమయంలోనే నా మిత్రుడు రాట్ వీలర్ అనే బ్రీడ్ కి సంబంధించిన కుక్కను బహుమతిగా ఇచ్చాడు. దానికి భానుమతి అని పేరు పెట్టి.. ఆ కోపాన్ని తీర్చుకున్నాను. ఆ తర్వాత మరొక కుక్కను తెచ్చుకొని దానికి రామకృష్ణ అని వాటి పిల్లలకు గాయత్రి అని పేరు పెట్టాను. ఈ విషయం భానుమతికి కూడా తెలుసు.. ఒకసారి ఆమె ఫోన్ చేసి మా ఆయన ఎలా ఉన్నారు అని అడిగింది.. నేను ఖంగుతిని ఏంటి అని అడుగగా అదే మీ కుక్క ఎలా ఉంది అని ఒక్కసారిగా నవ్వేసింది. నెగెటివ్ లో కూడా పాజిటివ్ వెతికే మంచి మనిషి భానుమతి” అని చెప్పుకొచ్చారు.