Hyderabad Police : పక్కా ప్లాన్ ప్రకారమే మహిళ హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఆరు రోజుల క్రితం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడలో నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెం లేని తలను పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి సోదరి, బావ గుర్తించడంతో ఆ మృతదేహాం.. కేర్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే ఎర్రం అనురాధదిగా పోలీసులు నిర్ధారించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహించేవారనీ.. ఆ డబ్బు విషయంలో తలెత్తిన గొడవల వల్లే హత్యకు గురైనట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే అనురాధను నిందితుడు హత్య చేసినట్లు గుర్తించారు. డెడ్‌బాడీని చికెన్ కొట్టే కత్తితో ముక్కలు ముక్కలు నరికి.. తలను మూసీ నదిలో పడేసి.. మిగిలిన శరీర భాగాలను బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచినట్లు పోలీసులు కనిపెట్టారు.
Also Read : TigerNageswaraRao: గజదొంగ చనిపొతే మూడు లక్షల మంది చూడడానికి వచ్చారట
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు, క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానాకు తరలించారు. నిందితుణ్ని పోలీసులు ఇంటికి తీసుకొచ్చి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రమౌళి ఇంట్లోనే అనురాధ రెంట్‌కు ఉంటున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో అప్పుల పాలైన ఇంటి ఓనర్ చంద్రమౌళి.. అనురాధ దగ్గర సుమారు రూ. 18లక్షలు అప్పు తీసుకున్నాట్లు.. గుర్తించారు.. ఆ డబ్బులు తిరిగి అడగడంతోనే అనురాధను హత్య చేసినట్లు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే అనురాధను హత్యచేసి.. మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : Car theft: కార్ దొంగిలించిన ముగ్గురు.. ఎవరికీ డ్రైవింగ్ రాదు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటే నవ్వాపుకోలేరు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..