TigerNageswaraRao: స్టూవర్టుపురం ఊరు అన్నా.. టైగర్ నాగేశ్వరరావు పేరు విన్నా.. ఇప్పుడు జనరేషన్ కు తెలియకపోవచ్చు. 70 వ దశకంలో ఈ పేర్లు వింటే.. ప్యాంట్ లు తడిచిపోయేవి. గజదొంగ పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు కనిపిస్తే కాల్చేయమని ప్రభుత్వాలు అప్పట్లో ఆదేశాలు కూడా జారీ చేశాయి. అలాంటి ఒక గజదొంగ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించడం విశేషం. ఇక గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా మాస్ మహారాజా రవితేజ కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ వంశీ.. ఈ సినిమా గురించి మాట్లాడాడు. రిపోర్టర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకొచ్చాడు. ” ఎవరైనా.. పాజిటివ్ గా ఉన్నవారిపై, సక్సెస్ అందుకున్నవారిపై సినిమాలు తీస్తారు. మీరు ఒక గజదొంగ మీద సినిమా తీయడం ఏంటి..? ఇందులో గజదొంగను పాజిటివ్ గా చూపించబోతున్నారా..? అన్న ప్రశ్నకు డైరెక్టర్ వంశీ ఘాటుగా సమాధానం చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan: ‘బ్రో’.. నీ స్పీడుకు బ్రేకుల్లేవ్ ఇక
” ఇప్పటివరకు అందరు.. సెలబ్రటీలు, స్పోర్ట్స్ పర్సన్స్, రాజకీయ నాయకుల మీద సినిమాలు తీశారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గురించి ఇక్కడ ఉన్న మీరందరికి తెలుసు. ఆయన మంచివాడు అని చెప్పడం లేదు. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఆయన జీవితంలో ఎవరికి తెలియని నిజం దాగుందని తెలుసుకున్నాను. గజదొంగ అయినా ఆయన చనిపోయినప్పుడు మూడు లక్షల మంది చూడడానికి వచ్చారట. ఇక ఇందులో టైగర్ నాగేశ్వరరావు చేసిన దొంగతనాలు.. ఆయన స్నేహితులు, శత్రువులు అందరిని అలా అలా టచ్ చేసి చూపించాం. ఖచ్చితంగా సినిమా అందరికీ నచుతుంది అని” చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందు రానుంది.